/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Baby Boy Named as LockDown| కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది జనజీవితాలు అస్తవ్యవస్తంగా మారిపోయాయి. పలు అగ్రరాజ్యాలతో సహా భారత్ కరోనా మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. భారత్‌లోనూ దాదాపుగా 20వేల కరోనా పాటిజివ్ కేసులు నమోదుకాగా, 640 మంది వైరస్ సోకి చనిపోయారు. ముఖ్యంగా వలసకూలీలు, దినసరి కార్మికులు కరోనా సమస్య కన్నా ఆకలి సమస్యతో నరకయాతన అనుభవిస్తున్నారు.  కిమ్ ఆరోగ్యంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో పుట్టిన తమ చిన్నారికి ఆసక్తికర పేరు పెట్టారు. రాజస్థాన్‌కు చెందిన వలస కూలీలు సంజయ్ బౌరి, మంజు బౌరిలు తమ బాబుకు లాక్‌డౌన్ అని నామకరణం చేయడం హాట్ టాపిక్‌గా మారుతోంది. వలసకూలీలు ప్రతి ఏడాది త్రిపురకు వెళ్లి అక్కడ చౌకధరకు ప్లాస్టిక్, పాత సామాన్లు విక్రయించేవారు. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!  

గర్భంతో ఉన్న మంజును సొంత గ్రామానికి తీసుకెళ్లాలని భర్త సంజయ్ భావించాడు. కానీ మార్చి చివరివారం నుంచి ఏప్రిల్ 14వరకు దేశంలో తొలి దశ లాక్‌డౌన్ విధించడంతో రాజస్థాన్‌కు వెళ్లడానికి వీలులేక త్రిపురలోని బధార్‌ఘాట్‌లో ఉండిపోయారు. ఈ క్రమంలో ఏప్రిల్ 13వ తేదీన మంజు బౌరి ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వం తమకు సహకరించిందని, ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఏఎన్ఐ మీడియాకు కార్మికుడు సంజయ్ తెలిపాడు. 

లాక్‌డౌన్ సమయంలో పుట్టిన మా బాబుకు బాగా ఆలోచించి లాక్‌డౌన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు. తమలాగే చాలా మంది కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఇక్కడ చిక్కుకుపోయారన్నాడు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రాజస్థాన్‌కు వెళ్లిపోతామని దినసరి కార్మికుడు సంజయ్ వివరించాడు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Section: 
English Title: 
Rajasthan's Migrant couple stranded in Tripura names their newborn as Lockdown
News Source: 
Home Title: 

విచిత్రం: ఆ బుడతడి పేరు ‘LockDown’..

విచిత్రం: ఆ బుడతడి పేరు ‘LockDown’
Caption: 
Image Credit: ANI
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
విచిత్రం: ఆ బుడతడి పేరు ‘LockDown’
Shankar Dukanam
Publish Later: 
No
Publish At: 
Wednesday, April 22, 2020 - 14:19