జియో ఫోన్ వినియోగదారుల కోసం వైఫై హాట్‌స్పాట్ అప్డేట్ విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన రిలయన్స్ జియో.. తాజాగా వారి కోసం మరో 2 రకాల కొత్త రీచార్జ్ ఓచర్లను ప్రవేశపెట్టింది.
టెలీకాం సంచలనం రిలయన్స్ జియో తన ప్రత్యర్ధి కంపెనీలను దెబ్బకొట్టేందుకు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించనుంది. వినియోగదారులకు వాయిస్ ఓవర్ వైఫై సేవలు అందించేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి సమాచారం అందించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు వాయిస్ ఓవర్ వైఫై సేవలు కోసం జియో తన 4జీ ఫీచర్ ఫోన్లలు అవసరమైన మార్పులు చేస్తోంది.
టెలీకాం రంగంలో సంచలనం.. రిలయన్స్ జియో మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదాయ వాటాలో ఐడియాను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది.
వివరాల్లోకి వెళ్లినట్లయితే.. టెలికాం రంగంలో ఎవరి వాట ఎంత ఉందనే వివరాలను ట్రాయ్ ఈ రోజు విడుదల చేసింది. ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018 మార్చి నాటికి .. 32 శాతం వాటాతో ఎయిర్ టెల్ అగ్రస్థానంలో ఉండగా..21 శాతం వాటాతో వొడాఫోన్ రెండో స్థానంలో ఉంది. 20 శాతం వాటాతో జియో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఐడియా 16.5 శాతం ఆదాయ వాటా నాల్గో స్థానంలో ఉంది.
భారతీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించిన రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ వినిపించింది. రూ.99 రీచార్జ్‌తో గతేడాది ప్రైమ్ మెంబర్షిప్ పొందిన పాత కస్టమర్లకు ఆ సభ్యత్వం గడువు రేపు 31వ తేదీతో ముగియనుంది. ప్రైమ్ మెంబర్షిప్ గతేడాది మార్చి నెలలో తీసుకున్న వారికైనా ఆ తర్వాత ఇంకెప్పుడు తీసుకున్న వారికైనా రేపే ప్రైమ్ మెంబర్షిప్ చివరి తేదీ కానుంది. దీంతో ఏప్రిల్ 1, 2018 నుంచి జియో ప్రైమ్ మెంబర్షిప్ కొనసాగిస్తారా ? ఒకవేళ కొనసాగిస్తే మళ్లీ ఎంత రీచార్జ్ చేయాల్సి వుంటుంది ?
భారతీయ టెలికాం రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకి ఓ గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటివరకు నిత్యం 1జీబీ డేటా అందించే అన్ని టారిఫ్‌లని పునఃసమీక్షించనున్నట్టు ఇటీవల ప్రకటించిన రిలయన్స్ జియో.. నేటి నుంచి కొత్త టారిఫ్ లు అందుబాటులోకి వచ్చినట్టు స్పష్టంచేసింది. కొత్త టారిఫ్ విధానం ప్రకారం ఇప్పటివరకు వున్న ధరకన్నా రూ.50 తక్కువ చార్జ్ చేయడం ఒక విధానం అయితే, అదే పాత ధరకు 50 శాతం డేటాను అధికంగా అందించడం మరో విధానం. వినియోగదారులు ఎంచుకున్న విధానాన్నిబట్టి ఆయా టారిఫ్ లు వర్తించనున్నట్టు జియో పేర్కొంది.
రిలయన్స్ జియో మరో సరికొత్త రికార్డు సృష్టించింది. 4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో ఆల్‌టౌమ్ రికార్డు నమోదు చేసింది. మేలో 19.123 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసిన జియో...అక్టోబర్ నెలలో 21.9 ఎంబీపీఎస్ సగటు వేగాన్ని నమోదు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అత్యధిక 4జీ డౌన్లోడ్ స్పీడుగా ఉంది. ఈ జాబితాలో వొడాఫోన్ 8.7 ఎంబీపీఎస్ వేగంతో జియో తరువాతి స్థానంలో ఉండగా, 8.6 ఎంబీపీఎస్‌తో ఐడియా, 7.5 ఎంబీపీఎస్ వేగంతో ఎయిర్టెల్ వరుసగా ఉన్నాయి.
డౌన్ లోడ్ లో ఐడీయా టాప్
టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో.. వినియోగదారుల కోసం తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ధన్ ధనా ధన్ ఆఫర్ తో తక్కువ ధరకే డేటా అందిస్తున్న జియో..దీపావళి పండగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చింది. ఈ ఆఫర్లో రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. ఈ బంపర్ ఆఫర్ ఈ రోజు నుంచి అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది.
వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.