హ్యాపీ న్యూస్: జియోలో భారీగా ఉద్యోగ అవకాశాలు

                            

Last Updated : Apr 27, 2018, 10:22 AM IST
హ్యాపీ న్యూస్: జియోలో భారీగా ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టెలీకాం దిగ్గ సంస్థ జియో భారీగా ఉద్యోగ ఆఫర్లు ప్రకటించనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా విస్తరించిన ఈ సంస్థలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది.  ప్రస్తుతం ఈ కంపెనీలులో 1.5 లక్షల ఉద్యోగులు పనిచేస్తున్నారు.. ఇంకా 70 నుంచి 80 వేల ఉద్యోగుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని  జియో సంస్థ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని జియో ప్రతినిధి సంజయ్ జోగ్ వెల్లడించారు.

ఈ సందర్భంగా జియో ప్రతినిధి సంజయ్ జోగ్ మాట్లాడుతూ 60-70 శాతం ఉద్యోగ నియామకాలు కళాశాల ద్వారానే ఉంటాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో రిలయన్స్ జతకట్టినట్లు వెల్లడించారు. సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ జోగ్ ఈ విషయాలు వెల్లడించారు. 

తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న జియో సంస్థకు ఇక్కడ వేల సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవానలి జియో సంస్థ భావిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం త్వరపడిండి.. దరఖాస్తు పెట్టుకోండి .ఆలోచిస్తే ఆశాభంగం..హాహాహా.  ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలును జియో వెబ్ సైట్ లో చూడవచ్చు. 

Trending News