డౌన్‌లోడ్ లో జియో..అప్‌లోడ్ లో ఐడియా టాప్

Last Updated : Dec 6, 2017, 12:38 PM IST
డౌన్‌లోడ్ లో జియో..అప్‌లోడ్ లో ఐడియా టాప్

రిల‌య‌న్స్ జియో మ‌రో సరికొత్త రికార్డు సృష్టించింది. 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో ఆల్‌టౌమ్ రికార్డు నమోదు చేసింది. మేలో 19.123 ఎంబీపీఎస్ వేగాన్ని న‌మోదు చేసిన జియో...అక్టోబర్‌ నెలలో  21.9 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్ని నమోదు చేసింది. అప్పటి  నుంచి ఇప్పటి  వ‌ర‌కు అదే అత్యధిక 4జీ డౌన్‌లోడ్ స్పీడుగా ఉంది. ఈ జాబితాలో వొడాఫోన్‌ 8.7 ఎంబీపీఎస్‌ వేగంతో జియో త‌రువాతి స్థానంలో ఉండ‌గా, 8.6 ఎంబీపీఎస్‌తో ఐడియా, 7.5 ఎంబీపీఎస్‌ వేగంతో ఎయిర్‌టెల్ వరుస‌గా ఉన్నాయి.

డౌన్ లోడ్ లో ఐడీయా టాప్

ఇక 4జీ డౌన్‌లోడ్ వేగంలో జియో టాప్ ప్లేస్‌లో ఉండగా.. అప్‌లోడ్‌ వేగంలో అందిరినీ ఆశ్చర్యపరుస్తూ ఐడియా టాప్ ప్లేస్ ను ఆక్రమించింది. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ఐడియా 6.4 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్ని నమోదు చేయ‌గా, ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా 5.9 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌, 4.1 ఎంబీపీఎస్‌తో జియో, 3.5 ఎంబీపీఎస్‌తో ఎయిర్‌టెల్ ఉన్నాయి.  ట్రాయ్ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలు బయటికి వచ్చాయి.  

Trending News