రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు.. నెలకు 1.1 TB డేటా ఉచితం !!

బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో కాలుమోపేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోన్న రిలయన్స్ జియో

Last Updated : May 8, 2018, 08:00 PM IST
రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు.. నెలకు 1.1 TB డేటా ఉచితం !!

వచ్చీ రావడంతోనే తనదైన స్టైల్లో ఆఫర్లు ప్రకటించి, అప్పటి వరకు టెలికాం రంగాన్ని ఏలిన దిగ్గజాలకు చుక్కలు చూపించిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలోనే బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లోనూ కాలుమోపేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. జియోఫైబర్‌ పేరుతో త్వరలోనే బ్రాడ్‌బ్యాండ్ సేవలను లాంచ్‌ చేసేందుకు రిలయన్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం పలు ఎంపిక చేసిన నగరాల్లో యూజర్లకు ఫ్రీ డేటాతో ఫైబర్‌-టూ-ది-హోమ్‌(ఎఫ్‌టీటీహెచ్) ప్రివ్యూ టారిఫ్‌లను అందిస్తున్న ఈ సంస్థ అధికారికంగా లాంచ్ అయిన తర్వాత బేస్ టారిఫ్ కింద నెలకు 100mbpd వేగంతో 100 GB డేటా ఇవ్వనుంది. ఈ డేటా ముగిసిన తర్వాత 40 GB పరిమితితో ఉచిత డేటాను టాప్ అప్ కింద అందించడం జరుగుతుంది. అలా నెలకు 25సార్లు టాప్ అప్ రీచార్జ్ చేసుకునే వెలుసుబాటు కల్పించనుంది రిలయన్స్. ఈ లెక్క ప్రకారం నెలకు 1.1TB వరకు డేటాను యూజర్లకు అందించనున్నట్టు ఎన్డీటీవీ వార్తా కథనం పేర్కొంది. 

ప్రస్తుతానికి అహ్మదాబాద్‌, చెన్నై, జమ్నానగర్‌, ముంబై, న్యూఢిల్లీ వంటి పలు ఎంపిక చేసిన నగరాల్లో జియో ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పరీక్షిస్తోంది. ఈ ఏడాది చివరిలో జియోఫైబర్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. జియోఫైబర్‌ కనెక్షన్‌ పొందాలంటే.. రూ.4500 వడ్డీ లేని సెక్యురిటీ రిఫండబుల్ డిపాజిట్‌ చెల్లించాల్సి వుంటుంది.

Trending News