రిలయన్స్ జియో నుంచి మరో బంపర్ ఆఫర్

రూ.1,295 విలువ గల ఇంటర్నెట్ డేటాతో పాటు రూ.2,300 విలువ కలిగిన ఓచర్స్‌ను తమ ఖాతాలో జమ చేసుకునే ఛాన్స్ వినియోగదారులకు అందిస్తున్న రిలయన్స్ జియో

Last Updated : Mar 4, 2018, 12:38 AM IST
రిలయన్స్ జియో నుంచి మరో బంపర్ ఆఫర్

టెలికాం రంగంలో సరికొత్త విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ ప్రకటిస్తూ తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటోంది. ఇప్పటికే ఇతర టెలికాం ఆపరేటర్ల ఊహకందనంత స్థాయిలో ఆఫర్లు అందిస్తూ టెలికాం రంగంలో పోటీలేకుండా చేసుకుంటున్న రిలయన్స్.. తాజాగా జియోఫై (JioFi) మరో ఆఫర్‌ను జియో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఆఫర్‌లోని వివరాల ప్రకారం రూ. 1,999 వెచ్చించి జియోఫై (JioFi) 4జీ హాట్‌స్పాట్‌ కొనుగోలు చేసిన వారు రూ. 1,295 విలువ గల ఇంటర్నెట్ డేటాతో పాటు రూ. 2,300 విలువ కలిగిన ఓచర్స్‌ను తమ ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారుడికి అందే మొత్తం రూ. 3,595 లబ్ధి చేకూరనుంది. 

జమ అయిన ఈ ఓచర్లను జియో, రిలయన్స్‌ డిజిటల్‌, పేటీఎం ద్వారా రిడిమ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్టు రిలయన్స్ జియో స్పష్టంచేసింది. రూ. 999 తోనూ జియోఫై లభిస్తోంది. అయితే, ఈ రూ.999 ల టారిఫ్‌కి ఉచిత డేటా, ఓచర్స్ ప్రయోజనాలు వర్తించవు.

Trending News