తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 943కి చేరింది. అందులో 725 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
మే3న ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా.. ఆ తర్వాత కూడా హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌పై అక్టోబర్ 15 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్న ఓ సర్కులర్ కూడా ఆ వార్తతో పాటే వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ పుకార్లపై స్పందించిన పర్యాటక శాఖ.. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ సర్కులర్ తాము విడుదల చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది.
ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ కార్మికుడు బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడే అనారోగ్యంతో చనిపోగా.. అతడి శవాన్ని ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఊర్లో ఉన్న కుటుంబసభ్యులు ఓ డమ్మీ చితికి నిప్పు పెట్టిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రభుత్వాలకు పన్ను, ఇతరత్రా రూపంలో వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం తీసుకుంటున్న చర్యలకు నిధుల విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
లాక్‌డౌన్‌ను పాటిస్తేనే కానీ కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచదేశాలన్నీ విధిగా లాక్ డౌన్, సోషల్ డిస్టన్స్ నిబంధనలను పాటిస్తూ కరోనాను నివారించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటికొస్తే చాలు... కరోనా వైరస్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.
ప్రపంచ వైద్య శాస్త్రానికే ముచ్చెమటలు పట్టించి సవాల్ గా నిలిచిన కరోనా వైరస్ చికిత్సకు అంతా సులువుగా పారదోలే పరిస్థితి లేదంటున్నారు వైద్య నిపుణులు. కేరళలోని ఓ మహిళకు 42 రోజులుగా
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,329 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించారు. అదే సమయంలో మరో 44 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావంతో ఇప్పటికే ఎన్నో పెళ్లిళ్ల తేదీలు, పెళ్లి ముహూర్తాలు ఖరారైనప్పటికీ చాలా మంది రద్దు చేసుకున్నారు. కరోనా విజృంభణ తగ్గిన తర్వాత పెళ్లికి ప్రణాళిక చేసుకోవాలని యోచిస్తున్నారు.
కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందిగా కోరుతూ అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ వంటి నిబంధనలను పాటించి కరోనాను తరిమికొట్టాల్సిందిగా ప్రముఖులు సందేశాలతో కూడిన వీడియోలు విడుదల చేసి జనంలో అవగాహన కల్పిస్తున్నారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 'కరోనా వైరస్' సోకిందా..? ఇప్పుడు పాకిస్తాన్లో ఇదే చర్చ జరుగుతోంది. అసలే పాకిస్తాన్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. పైగా పెద్దగా వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆర్ధిక వ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉంది.
'కరోనా వైరస్'.. మృత్యుకేళీ ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారి కారణంగా.. లక్షలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికే లక్ష మందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుందీ మహమ్మారి. కానీ కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వైద్యులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
'కరోనా వైరస్' లాక్ డౌన్ వేళ టాలీవుడ్లో #BetheREALMAN ఛాలెంజ్ కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగా దీన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న మగవారు.. ఇంటి పనుల్లో సహాయం చేసి.. రియల్ మ్యాన్‌గా నిరూపించుకోవాలన్నది దీని ఉద్దేశ్యం. అంతే కాదు ఆయన దీన్ని దర్శక ధీరుడు రాజమౌళిని నామినేట్ చేశారు.
'కరోనా వైరస్'.. ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహమ్మారి వైరస్ కారణంగా.. అంతా స్తబ్దుగా మారిపోయింది. ప్రపంచమే లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయింది. జనం ఇళ్ల నుంచి బయటకు రావడమే గగనంగా మారింది.
'కరోనా వైరస్'.. విస్తరించని ప్రాంతం అంటూ లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో సర్వత్రా జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న మహమ్మారితో దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. చైనాలో పుట్టిన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలను గజగజావణికిస్తోంది.
రంజాన్ మాసం (Ramzan month) సమీపిస్తోంది. ఏప్రిల్ 23, గురువారం నాడు ప్రారంభం కానున్న రంజాన్ పవిత్ర మాసం మే 23, శనివారం నాడు ముగియనుంది. రంజాన్ మాసంలో (Ramadan month) సంప్రదాయం ప్రకారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరపడం ఒక ఆనవాయితీ.
కరోనా వైరస్‌ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ పాటిస్తుండటంతో యావత్ ప్రజానీకం లాక్డౌన్లో ఇంటికే పరిమితం అయ్యారు. సాధారణ ప్రజలు ఈ క్వారంటైన్ సాదాసీదాగానే గడుపుతున్నప్పటికీ.. సమయం విలువ తెలిసిన వాళ్లు, కాస్తో, కూస్తో డబ్బున్నోళ్లు మాత్రం ఆన్లైన్లో పాఠాలు వింటూ తమ సమయాన్ని వృధా కాకుండా చూసుకుంటున్నారు.
కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతున్న
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కేరళ సర్కారు.. లాక్ డౌన్ సడలించింది. ఐతే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఘాటుగా లేఖ రాయడంతో .. కేరళ సర్కారు కాస్త మెత్తబడింది. లాక్ డౌన్ సడలింపును మళ్లీ వెనక్కి తీసుకునేందుకు పరిశీలిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.