April salaries: ఏప్రిల్‌లోనూ సర్కార్ ఉద్యోగులకు వాయిదా పద్ధతే!

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రభుత్వాలకు  పన్ను, ఇతరత్రా రూపంలో వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం తీసుకుంటున్న చర్యలకు నిధుల విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.

Last Updated : Apr 22, 2020, 01:05 AM IST
April salaries: ఏప్రిల్‌లోనూ సర్కార్ ఉద్యోగులకు వాయిదా పద్ధతే!

హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రభుత్వాలకు  పన్ను, ఇతరత్రా రూపంలో వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం తీసుకుంటున్న చర్యలకు నిధుల విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల తరహాలోనే ఏప్రిల్‌ నెల వేతనాల్లో కూడా కొంత మొత్తాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ సర్కార్ స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Also read : ఏపీకి రూ.1,892.64 కోట్లు, తెలంగాణకు 982 కోట్లు

ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల వేతనంలో కొంత మొత్తాన్ని వాయిదా వేస్తున్నట్టుగా గతంలో జారీ అయిన జీవో నం: 27 ప్రకారమే ఏప్రిల్‌ నెల వేతనంలో కూడా కొంత భాగాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. అయితే పింఛన్‌దారులకు మాత్రం కొంత ఊరటనిస్తూ.. వారి నెల వారీ పింఛన్‌లో 25% మాత్రమే వాయిదా వేయాలని సర్కార్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు సమాచారం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News