'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న మహమ్మారితో దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. చైనాలో పుట్టిన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలను గజగజావణికిస్తోంది.
కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. మే 3 వరకు జనం బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాలు, అత్యవసరల పనుల కోసం తప్ప .. ఎవరూ బయటకు రావొద్దని మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో జనం మాట వినడం లేదు. నిత్యం పోలీసులు పహారా కాస్తున్నా.. బయటకు వచ్చి .. తమ ప్రాణాలకు తామే ముప్పు తెచ్చుకుంటున్నారు.
కరోనా వైరస్ మహరాష్ట్రలో ఉద్ధృతంగా విస్తరిస్తోంది. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కానీ జనం బయటకు వస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న పుణేలో మార్నింగ్ వాక్ కోసం జనం బయటకు వచ్చారు. వారికి పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ యోగా చేయించి పంపించారు.
ఇప్పుడు థానేలో కొంత మంది మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చారు. రోజూ బయటకు వచ్చిన జనాన్ని కొట్టికొట్టీ అలసిపోయిన పోలీసులు.. వారికి పూజ చేశారు. దయచేసి ఇంట్లోనే ఉండాలని కోరారు. భక్తి పాటలు పాడుతూ పూజ చేయడం వీడియోలో చూడవచ్చు.
#WATCH: Police perform 'aarti' of people who were out on the streets for morning walk amid #Coronaviruslockdown in Thane, today. #Maharashtra pic.twitter.com/aqHk6SFZom
— ANI (@ANI) April 21, 2020
లాక్ డౌన్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి.. మీరు కూడా ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని జీ హిందూస్తాన్ కోరుతోంది. కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గం..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
లాక్ డౌన్ వేళ బయటకొస్తే పూజిస్తాం..!!