ఆ విద్యార్థులు చేసిన పనికి అవాక్కయిన పోలీసులు...

కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా కొన‌సాగుతున్న

Last Updated : Apr 20, 2020, 05:01 PM IST
ఆ విద్యార్థులు చేసిన పనికి అవాక్కయిన పోలీసులు...

అమరావతి : కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా కొన‌సాగుతున్న క్ర‌మంలో ప్ర‌జార‌వాణాకు వినియోగించే ఎటువంటి వాహ‌నాల‌కు అనుమ‌తి లేద‌ని, దీంతో స్వ‌స్థ‌లాల‌కు దూరంగా ఉంటున్న‌వారంతా  ఏలాగైనా స్వస్థలాలకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

అందులో భాగంగానే కొంతమంది కాలినడకన వెళుతుండగా, మరికొంతమంది మాత్రం పోలీసుల కళ్లు గప్పి స్వస్థలాలకు వెళ్లేందుకు ఇష్టానురీతిలో వ్యవహరిస్తున్నారు. అలాగే ప్ర‌య‌త్నించిన ముగ్గురు విద్యార్థులు ప్రకాశం జిల్లా కారంపూడికి చెందిన ముగ్గురు విద్యార్థులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చిక్కుకుపోయారు. ఏలాగైనా తమ స్వస్థలానికి వెళ్లాలని హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు వెళుతున్న ఓ ఖాళీ పాల వాహనాన్ని ఎక్కారు. డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి పాల వ్యాన్ లోపల కూర్చొని రహస్యంగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్‌కు చిక్కారు. ముగ్గురు విద్యార్థులతో పాటు లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాన్‌ను కూడా సీజ్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

 ఏపీలో దారుణం: లాఠీ దెబ్బలకు యువకుడి మృతి!   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos 

Trending News