వెనక్కి తగ్గిన కేరళ

'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కేరళ  సర్కారు.. లాక్ డౌన్ సడలించింది.  ఐతే దీనిపై  కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఘాటుగా లేఖ రాయడంతో  .. కేరళ సర్కారు కాస్త మెత్తబడింది. లాక్ డౌన్ సడలింపును మళ్లీ వెనక్కి తీసుకునేందుకు పరిశీలిస్తోంది.

Last Updated : Apr 20, 2020, 03:12 PM IST
వెనక్కి తగ్గిన కేరళ

'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కేరళ  సర్కారు.. లాక్ డౌన్ సడలించింది.  ఐతే దీనిపై  కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఘాటుగా లేఖ రాయడంతో  .. కేరళ సర్కారు కాస్త మెత్తబడింది. లాక్ డౌన్ సడలింపును మళ్లీ వెనక్కి తీసుకునేందుకు పరిశీలిస్తోంది.

'కరోనా వైరస్' ఉద్ధృతిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 2.0  అమలు  చేస్తోంది. ఐతే ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న దృష్ట్యా ఏప్రిల్ 20 నుంచి నిబంధనలు కాస్త సడలిస్తూ అత్యవసర రంగాల్లో కార్యకలాపాలు సాగేలా అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన  మార్గదర్శకాలు  కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో కేరళ  సర్కారు   కూడా నిబంధనలు  కాస్త సడలించింది.

రాష్ట్రంలోని ప్రాంతాలను నాలుగు జోన్‌లుగా విభజించిన కేరళ సర్కారు.. గ్రీన్ జోన్‌లలో మాత్రం లాక్ డౌన్ సడలింపును కాస్త ఎక్కువగానే చేసింది. అంటే హోటళ్లు, రెస్టారెంట్లు, సెలూన్లు పునః ప్రారంభానికి అనుమతులు ఇచ్చింది. అంతే కాదు పరిమిత దూరాలకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఇది  కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. 

ఇవాళ ఉదయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ సర్కారుకు ఘాటుగా లేఖ  రాసింది. లాక్ డౌన్ మార్గదర్శకాలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005ని ఉల్లంఘించడమేనని లేఖలో పేర్కొంది.  

ఐతే కేంద్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో కేరళ సర్కారు వెనక్కి తగ్గింది. లాక్ డౌన్ సడలిస్తూ ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోనుంది. ఈ రోజు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం పినరయి విజయన్ చర్చించనున్నారు. ఆ తర్వాత కొత్త నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News