రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం ఆరు అడుగుల ఎత్తులో గోడ నిర్మించింది. ఏపీకి నిత్యవసరాలు సరఫరా చేసే ప్రధాన దారుల్లో గోడల నిర్మించడంపై
తెలంగాణలో రోజూ వారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండటం అటు తెలంగాణ సర్కార్‌కి ఇటు కరోనాతో ఆందోళనకు గురవుతున్న ప్రజానికానికి కొంత ఊరట కలిగిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 7కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా సోమవారం ఆ సంఖ్య 2కి పడిపోవడం గమనార్హం.
లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే.. దానికి తోడు ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను ఇంకొంత నష్టపరిచాయని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఓవైపు తెలంగాణలో రైతులు ఇలా నానా ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు తెలంగాణ సర్కార్ మాత్రం రైతుల అవస్థలను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అత్యవసర సేవల విభాగంలో ఉన్న ఓ అంబులెన్సును సీఎం కాన్వాయ్ అడ్డగించిందని ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ముఖ్యమంత్రి పళనిస్వామి, నగర పోలీసులు తమపై వస్తున్న ఈ ఆరోపణలను ఖండించారు.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. అంతే కాదు ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ఇప్పటికే ఊళ్లు, పట్టణాల మధ్య చిచ్చు పెట్టిందీ మహమ్మారి. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీలు సృష్టిస్తోంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కారణంగా.. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కొత్త రగడ మొదలవుతోంది.
లాక్ డౌన్ సమయంలో ఆటగాళ్లు అంతా క్రీడలకు దూరం కావడంతో తమ శరీరం ఫిట్నెస్ కోల్పోకుండా ఉండటం కోసం ఎప్పటిలాగే నిత్యం కొంత సమయాన్ని ఇండోర్ ఎక్సర్‌సైజెస్‌కి కేటాయించడం మర్చిపోవడం లేదు. లేదంటే మళ్లీ మైదానంలోకి వచ్చాకా ఇబ్బందులు తప్పవని వాళ్లకు తెలుసు కనుక. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా తన శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం కోసం ఇంట్లోనే ఇదిగో ఇలా రకరకాల ఎక్సర్‌సైజెస్‌తో వ్యాయమం చేస్తున్నాడు.
మానవాళిని మహమ్మారిలా పీడిస్తోంది 'కరోనా వైరస్'. దాని దెబ్బకు అగ్రరాజ్యం నుంచి అతి చిన్న దేశం దాకా గజగజలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రపంచ మానవాళి.. అంతా చిగురుటాకులా వణుకుతున్నారు. లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అంతే దాదాపు 11 లక్షలకు పైగా కరోనా బారిన పడ్డవారు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
'కరోనా వైరస్'..కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో పేద వారికి పట్టెడన్నం దొరకని పరిస్థితి నెలకొంది. పట్టణపేదలకు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వాలు ఆహారం లేదా నిత్యావసర సరుకులు అందిస్తున్నాయి.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'కరోనా వైరస్'.. మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల 892కు చేరింది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 872 మంది బలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి.
మహారాష్ట్ర నుంచి సొంత గ్రామానికి ఓ వలస కార్మికుడు 3000 కి.మీ మేర సైకిల్ ప్రయాణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన కార్మికులు తన అనుభవాలను ఏఎన్ఐ మీడియాతో షేర్ చేసుకున్నాడు.
20 ఏళ్ల క్రితం 'జలదృశ్యం'లో పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవాంతరాలు దాటుకుని .. లక్ష్యసాధన పూర్తి చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 తర్వాత పొడిగించాలని ఢిల్లీతో సహా ఐదు ప్రధాన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. లాక్ పొడిగింపు విషయంలో కేంద్రం తర్జనభర్జనలో ఉండగా రాష్ట్రాలు
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే కార్యక్రమాన్ని విదేశీ వ్యవహారాల, పౌర విమానయాన, ఎయిర్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నట్లు తెలిపాయి.
రాజస్థాన్ రాష్ట్రంలో క్వారంటైన్ లో ఉన్న ఓ మహిళను ముగ్గురు దుండగులు లైంగికదాడి చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాక్ డౌన్ కారణంగా ఓ మహిళ
తెలంగాణ రాష్ట్ర సమితి.. !! తెలంగాణలో తెలంగాణ రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ. మలిదశ ఉద్యమానికి నాంది పలికి పురుడు పోసుకున్న పార్టీ.. రేపటి (సోమవారం) తో 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండోసారి తెలంగాణ అధికార పీఠాన్ని చేజిక్కించుకుని పాలన సాగిస్తోంది.
'కరోనా వైరస్'.. మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ ..కరోనా దెబ్బతో విలవిలలాడుతోంది. చివరకు చైనా, ఇటలీ, స్పెయిన్ కంటే దారుణంగా కరోనా మహమ్మారి దెబ్బకు బలైపోతోంది.
కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ప్రతి పౌరుడు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అప్పుడే కరోనా వైరస్ లొంగి వస్తుందని పేర్కొన్నారు.
టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'శివమణి'. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం మళ్లీ అందరికీ గుర్తుకు వస్తోంది. భవిరి రవి అనే మిమిక్రీ ఆర్టిస్ట్ చేసిన ఓ పేరడీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడమే అందుకు కారణం.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. భారత దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు శరవేగంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.