PM Modi AP Tour: ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు సర్వం సిద్ధం..

PM Modi AP Tour: విశాఖలో ఈరోజు  సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ  నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.  పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్ గా 20 ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 8, 2025, 09:55 AM IST
PM Modi AP Tour: ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు సర్వం సిద్ధం..

PM Modi AP Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాత తొలిసారి ఏపీ పర్యటకు వస్తున్నారు. సాయంత్రం 4.15 గం.లకు ప్రధాని మోదీ విశాఖ చేరుకుంటారు. సాయంత్రం  4 గంటల .45  నిమిషాల  నుండి  ఐదున్నర వరకూ  రోడ్డు షోలో పాల్లొంటారు. గతేడాది ఎన్నికల ముందు విజయవాడలో ప్రధాన మంత్రి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ ముగ్గరు నేతలు రోడ్డు షో నిర్వహించనున్నారు.
అనంతరం  ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. తరువాత  సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల 15 నిమిషాల ప్రాంతంలో విశాఖ నుండి భువనేశ్వర్ బయలుదేరి వెళతారు.

ప్రధాని మోడి విశాఖలో సుమారు 3 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ‍యూ గ్రౌండ్స్‌లో వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బిబినగర్,గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వంటి పనులకు ప్రైమ్ మినిష్టర్ శంఖుస్థాపన చేస్తారు. అదే విధంగా 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరి పేట 6లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు పలు జాతీయ రహదార్లు,రైల్వే లైన్ల ను వర్చువల్ గా ప్రారంభిస్తారు.

ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్డు షోలో పాల్గొనేందుకు వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల వాహనాల పార్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.  సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన జరగనున్నందున రోడ్డు షో, సభా వేదిక,వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుండి ప్రజలను బస్సులు,ఇతర వాహనాల్లో తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, ఇతర సౌకర్యలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.  వాహనాల పార్కింగ్ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు చర్యలు చేపట్టింది.

విశాఖనగరంలో ప్రధాని రోడ్డు షోలో సుమారు 80వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.బహిరంగ సభలో లక్షా 80 వేల మంది పాల్గొనేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏర్పాట్లును పరిశీలించారు. ప్రధాని రోడ్‌ షో  సభ, ఏర్పాట్లను  విజయవంతం చేయాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకు స్థాపనలతో పాటు కొన్ని పూర్తైయిన ప్రాజెక్టులకు జాతికి అంకితం చేయనున్నారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News