'కరోనా వైరస్'.. విస్తరించని ప్రాంతం అంటూ లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో సర్వత్రా జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
భారత దేశంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి వేగంగానే ఉంది. తాజాగా రాష్ట్రపతి భవన్‌లోకి కూడా కరోనా వైరస్ ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అత్యంత భద్రత ఉండే రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో వైరస్ ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని రాష్ట్రపతి భవన్ సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. కరోనా కలకలం రేగడంతో రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్ మొత్తం ఐసోలేషన్ పరిధిలోకి వెళ్లిపోయింది.
వైరస్ ఎలా ప్రవేశించిందంటే..?
రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుని కుటుంబ సభ్యురాలికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐతే ఆ ఇంట్లోనే మిగతా కుటుంబ సభ్యులందరికీ నెగటివ్ ఫలితం వచ్చింది. కరోనా వైరస్ సోకిన మహిళ రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో విధులు నిర్వర్తించడం లేదు. ఇది ఒక్కటే ఊరటనిచ్చే అంశం. కానీ ఆమె విశాలమైన రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో నివసిస్తోంది. దీంతో రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో ఇప్పుడు గుబులు పుట్టింది. కాబట్టి రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌ను పూర్తిగా ఐసోలేషన్ పరిధిలో ఉంచారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో మొత్తం 125 ఇళ్లు ఉన్నాయి. అందులో ఉన్న వారందరినీ బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉంచారు.
మరోవైపు భారత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 18 వేల మార్క్ దాటింది. ఇప్పటి వరకు 590 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
రాష్ట్రపతి భవన్లో 'కరోనా' కలకలం