Rajinikanth: కంట్రోల్‌ తప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎయిర్‌పోర్టులో మీడియాపై చిందులు

Rajinikanth Lose Control On Media News Viral: ఎప్పుడూ శాంతమూర్తిగా కనిపించే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆ విషయాలు నన్ను అడగొద్దు' అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 7, 2025, 04:05 PM IST
Rajinikanth: కంట్రోల్‌ తప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎయిర్‌పోర్టులో మీడియాపై చిందులు

 Rajinikanth Angry: కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌లోని మరో కోణాన్ని ప్రజలతోపాటు మీడియా చూసింది. ఎప్పుడూ శాంతంగా ఉండే రజనీకాంత్‌కు కోపమొచ్చింది. తనపై ప్రశ్నలతో విసిగించిన మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయి విమానం ఎక్కేశారు. ఈ సంఘటన వైరల్‌గా మారింది. సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

Also Read: Vishal Health: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ప్రముఖ హీరో విశాల్‌.. అసలు ఏం జరిగింది?

లొకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ 'కూలీ' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్‌లో 171 సినిమా కావడం.. వరుసగా ఫ్లాపుల నేపథ్యంలో ఈ సినిమా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో చిత్రబృందం ఉంది. ఈ క్రమంలో సినిమాలోని కీలక సన్నివేశాలు థాయిలాండ్‌లో చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌ కోసం థాయిలాండ్‌ వెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు రాగా మీడియా పలకరించింది. ఈ సందర్భంగా కూలీ సినిమా విషయాలు పంచుకుంటున్న సమయంలో రిపోర్టర్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆయనకు కోపం వచ్చింది.

Also Read: Game Changer: గేమ్ చేంజర్ ఈవెంట్‌లో అపశ్రుతి.. గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ దిగ్భ్రాంతి

చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరగడంతో తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. రాజకీయంగా దుమారం రేపుతున్న సమయంలో ఈ అంశాన్ని రజనీకాంత్‌ ముందు మీడియా ప్రస్తావించింది. 'మహిళల భద్రతపై మీ స్పందన ఏమిటి?' మీడియా ప్రశ్నించగా రజనీకాంత్‌ అసహనం వ్యక్తం చేస్తూ 'నన్ను రాజకీయ ప్రశ్నలు అడగవద్దు' అని చెప్పారు. అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దని ఒకింత కోపంతో రజనీ సూచించారు.

కూలీ అప్‌డేట్‌
కూలీ సినిమా అప్‌డేట్‌ విషయానికి వస్తే 'ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 70 శాతం పూర్తయ్యింది. జనవరి 13 నుంచి జనవరి 28వ తేదీ వరకు మరో షెడ్యూల్‌ ఉంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మిగతా వివరాలు పంచుకుంటాం' అని రజనీకాంత్‌ చెప్పారు. కాగా కూలీ సినిమాలో రజనీకి జోడిగా శ్రుతి హాసన్‌ నటిస్తుండగా.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నాయి.

 
 
 
 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News