Viral video: పాములు కూడా లాక్ డౌన్ పాటిస్తున్నాయా ? వైరల్ వీడియో

లాక్‌డౌన్‌ను పాటిస్తేనే కానీ కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచదేశాలన్నీ విధిగా లాక్ డౌన్, సోషల్ డిస్టన్స్ నిబంధనలను పాటిస్తూ కరోనాను నివారించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటికొస్తే చాలు... కరోనా వైరస్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.

Last Updated : Apr 22, 2020, 12:18 AM IST
Viral video: పాములు కూడా లాక్ డౌన్ పాటిస్తున్నాయా ? వైరల్ వీడియో

లాక్‌డౌన్‌ను పాటిస్తేనే కానీ కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచదేశాలన్నీ విధిగా లాక్ డౌన్, సోషల్ డిస్టన్స్ నిబంధనలను పాటిస్తూ కరోనాను నివారించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటికొస్తే చాలు... కరోనా వైరస్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. అందుకే ప్రభుత్వాలు సైతం పౌరులు ఇళ్లకే పరిమితం కావాలని పదేపదే సూచిస్తున్నాయి. ప్రముఖులు కూడా ఇదే విషయాన్ని వీడియోల రూపంలో, సోషల్ మీడియాలో సందేశాల రూపంలో పౌరులకు అర్థమయ్యేలా చెబుతున్నారు. ఈ విషయం సర్పాలకు కూడా అర్థమైనట్టుంది కాబోలు. లాక్ డౌన్‌కి మద్దుతు పలుకుతున్నట్టుగా ఇదిగో ఇలా ఓ కన్నంలో నక్కిన సర్పాలన్నీ.. ఆ కన్నంలోంచే ఎలా తొంగి చూస్తున్నాయో చూడండి.

 

Also read: Coronavirus updates: 19 వేలకు చేరువలో కరోనా కేసులు, 603కి చేరిన మృతుల సంఖ్య

కన్నం చిన్నది కావడం వల్లే సోషల్ డిస్టన్స్ ఒక్కటే పాటించడం లేదు కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్టుగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News