డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. తద్వారా 5 పర్యాయాలు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులను ప్రశంసించారు.
IPL 2020 Leading Run Scorer List | కరోనా వైరస్ కారణంగా యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో పరుగుల వరద పారింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐదో పర్యాయం ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2020 ఆరెంజ్ క్యాప్ సాధించాడు.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది.
SRH vs DC Match Preview | ఢిల్లీలో మ్యాచ్ విన్నర్లు ఉన్నా.. నిలకడలేమీ ప్రధాన సమస్యగా మారింది. ధావన్, అయ్యర్, షా, పంత్ రాణించాల్సి ఉంటుంది. వీరికి తోడు స్టోయినిస్ ఆల్ రౌండ్ ప్రదర్శన అవసరం. జేసన్ హోల్డర్ రాకతో జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మరింత పటిష్టమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, విలియమ్సన్, మనీష్ పాండే, హోల్డర్, బ్యాటింగ్‌లో హైదరాబాద్‌కు ప్రధాన బలం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ ఈసారి కూడా తమదేనంటున్నాడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). అవును మరి ఆ జట్టు ఫైనల్‌కు చేరిందంటే కప్పు ఎగరేసుకుపోవడం దాదాపుగా ఖాయం. అందులోనూ గత 7 ఐపీఎల్ ట్రోఫీలలో నాలుగు టైటిల్స్ ముంబై ఇండియన్స్ నెగ్గడం గమనార్హం.
RCB In IPL 2020 Playoff | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2020 టైటిల్ గెలవడం కష్టమేనని మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకూ ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా దక్కించుకోవాలని విరాట్ కోహ్లీ సేన ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ఆర్సీబీకి అంత ఈజీ కాదని మాజీ క్రికెటర్ అంటున్నాడు.
ఐపిఎల్ 2020లో మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) కెప్టేన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలిసారిగా ప్లే ఆఫ్స్‌లోకి ( Playoffs ) వెళ్లకుండానే నిష్క్రమించింది. మూడుసార్లు ఐపిఎల్ టైటిల్ గెల్చుకున్న చెన్నై జట్టు ( CSK ) ఈసారి ఘోర పరాజయాలు చవిచూసింది. ముఖ్యంగా ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన మహేంద్ర సింగ్ కేవలం 200 పరుగులు మాత్రమే చేయడం అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలకు తావిచ్చింది.
KKR beat RR by 60 runs in IPL 2020 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) నిష్క్రమించింది. జట్టులో ఏడు, ఎనిమిది మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ దీనిపై స్పందించి పలు విషయాలు ప్రస్తావించాడు.
ఈ ఐపీఎల్ (IPL 2020) సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా ఇంటి బాట పట్టింది. అయితే చెన్నై ముందుగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లీగ్ చివరి దశలో అద్భుత ఫాంలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings ) జట్టు.. ముందు నుంచి రాణిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.
Sunrisers Hyderabad IPL 2020 Playoffs Chances | ఆరెంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సమష్టిగా ఆడి ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మరో ఆరు జట్ల ముందున్న లక్ష్యం ప్లేఆఫ్స్‌కే అర్హత సాధించడం.
Mumbai Indians vs Delhi Capitals IPL 2020లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు అరుదైన ఘనతను సాధించింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడ్డ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు ఆ ఘనతను అందుకుంది.
క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.
CSK Captain MS Dhoni | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పని అయిపోయిందని, ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కెప్టెన్‌గానూ రాణించలేకపోతున్నాడని విమర్శలు మొదలయ్యాయి. దీంతో వచ్చే ఎంఎస్ ధోనీని సీఎస్కే కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2021 సీజన్లో సీఎక్కేకు కొత్త కెప్టెన్ వస్తారని నెటిజన్లు పలు పోస్టులు చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
IPL 2020: SRH beat DC by 88 Runs: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) భారీ విజయాన్ని అందుకుంది. పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై విజయాన్ని సాధించి కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు సన్‌రైజర్స్ మంచి గిఫ్ట్ ఇచ్చింది.
ఐపీఎల్ 13వ సీజన్లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.
RR vs MI Match Hardik Pandya | రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇరుజట్ల అభిమానులతో పాటు నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. నల్లజాతి వారి కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపిన తొలి ఐపీఎల్ క్రికెటర్‌గా పాండ్యా నిలిచాడు.
IPL 2020 Final Date : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. దీంతో తాజాగా ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికల్ని ఖరారు చేశారు. నవంబర్ 10న దుబాయ్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. IPL 2020 Final Venue
ఐపీఎల్ చరిత్రలో.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరాభవాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నైసూపర్ కింగ్స్ పాతాళానికి పడిపోయింది.
Dwayne Bravo Ruled Out from IPL 2020 | చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్కే స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి వైదొలిగాడని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. మిగతా మ్యాచ్‌లకు డ్వేన్ బ్రావో అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.