MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్

CSK Captain MS Dhoni | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పని అయిపోయిందని, ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కెప్టెన్‌గానూ రాణించలేకపోతున్నాడని విమర్శలు మొదలయ్యాయి. దీంతో వచ్చే ఎంఎస్ ధోనీని సీఎస్కే కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎక్కేకు కొత్త కెప్టెన్ వస్తారని నెటిజన్లు పలు పోస్టులు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. 

Last Updated : Oct 28, 2020, 10:13 AM IST
  • ధోనీ పని అయిపోయిందని, ఐపీఎల్‌లో రాణించలేకపోతున్నాడని విమర్శలు
  • చెన్నై జట్టు, కెప్టెన్ ధోనీపై విమర్శలకు బదులిచ్చిన సీఈఓ కాశీ విశ్వనాథన్
  • ఎంఎస్ ధోనీపై మాకు నమ్మకం ఉంది, ఒక్క సీజన్‌తో జడ్జిమెంట్ ఇవ్వొద్దని సూచన
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పని అయిపోయిందని, ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో కెప్టెన్‌గానూ రాణించలేకపోతున్నాడని విమర్శలు మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఈ ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండిపోయింది. దీంతో వచ్చే ఎంఎస్ ధోనీని సీఎస్కే కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎక్కేకు కొత్త కెప్టెన్ వస్తారని నెటిజన్లు పలు పోస్టులు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. 

 

ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ (MS Dhoni will lead CSK in 2021)నే కొనసాగనున్నట్లు ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. అంతర్జాతీయంగా, ఐపీఎల్‌లోనూ విజయవంతమైన కెప్టెన్ ధోనీ అని ప్రశంసించారు. ధోనీపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. అయితే ప్రస్తుత సీజన్‌లో సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం డ్వేన్ బ్రావో గాయపడటం చెన్నై జట్టుకు ప్రతికూల ఫలితాలు వచ్చేలా చేసిందన్నారు.

 

ధోనీ బ్యాటింగ్‌పై సైతం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై సైతం సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఐపీఎల్‌లో ధోనీ అత్యంత విలువైన ఆటగాడని, ఫ్రాంచైజీకి కలిసిరాని ఒక్క ఏడాది ధోనీలాంటి ఆటగాడి సామర్థ్యాన్ని నిర్ణయించలేదు. సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. లీగ్‌ చరిత్రలో చెన్నైకి ఉన్న రికార్డు మరే జట్టుకూ లేదని’ సీఎస్కే గురించి, కెప్టెన్ ధోనీ గురించి విశ్వనాథన్‌ వివరించారు. ఏది ఏమైనా ధోనీ నిర్ణయం తీసుకునే వరకు దీనిపై ఓ స్పష్టతకు రాకూడదు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News