Natarajan ruled out of IPL 2021: చెన్నై: హ్యాట్రిక్ ఓటముల తర్వాత పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి ఇప్పుడిప్పుడే జోష్‌లోకి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెంటనే మరో ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టి. నటరాజన్ IPL 2021 సీజన్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నటరాజన్ ఆస్ట్రేలియా టూర్లో ఉండగా మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే.
MS Dhoni In IPL: వయసు మీద పడిందని రిటైర్ కావాలని, బ్యాట్ ఝులిపించడం లేదని సైతం ధోనీపై ఎన్నో విమర్శలు గత ఏడాది నుంచి వెల్లువెత్తుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది.
IPL 2021 KKR Captain Eoin Morgan Fined Rs 12 Lakh | ఫోర్లు, సిక్సర్ల వర్షంతో భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 18 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. కానీ క్రికెట్ ప్రేమికులు మాత్రం ఐపీఎల్ మజాను ఆస్వాదించారు. క్రికెట్ ప్రేమికులు కోరుకున్న మ్యాచ్ నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది.
MS Dhonis Parents Tested Positive For COVID-19 |పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వారం రోజుల వ్యవధిలో రెట్టింపు నిర్ధారితమవుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బుధవారం ఉదయం చెడు వార్త వినాల్సి వచ్చింది. ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
IPL 2021 Mumbai Indians Captain Rohit Sharma Fined: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఎదురుదెబ్బ తగిలింది. రూ.12 లక్షల భారీ జరిమానాకు గురయ్యాడు.
IPL 2021: తొలి మూడు మ్యాచ్‌లలో 2 మ్యాచ్‌లు నెగ్గి ఐపీఎల్ 2021 టైటిల్ రేసులో సీఎస్కే ఉందని కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రమాదకర సంకేతాలు పంపాడు. మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 45 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ దీనిపై స్పందించాడు.
MS Dhoni Ban Latest News: 199 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించగా, గాయంతో దూరమైన మ్యాచ్‌కు సురేశ్ రైనా సారథిగా వ్యవహరించాడు. పంజాబ్ కింగ్స్‌పై సీఎస్కే విజయం సాధించింది.
Ban On MS Dhoni | భారత్‌కు టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరువాత రెండు మ్యాచ్‌లలో చిన్న తప్పిదం మరోసారి రిపీట్ చేశాడంటే రెండు నుంచి 4 మ్యాచ్‌ల వరకు అతడిపై నిషేధం పడనుంది.
Ben Stokes Ruled Out Of IPL 2021: రాజస్తాన్ రాయల్స్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కేవలం ఒకే మ్యాచ్ ఆడిన బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
IPL 2021 SRH vs KKR Live Updates: కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. చెన్నై వేదికగా రాత్రి 7 గంటలక్ టాస్ వేయగా, ఏడున్నర గంటలకు మ్యా్చ్ ప్రారంభం కానుంది. గత సీజన్లో గాయాలు బాధించినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరి సత్తా చాటింది.
CSK Captain MS Dhoni Fined: సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తొలి తప్పిదానికి వివో ఐపీఎల్ 2021లో తొలి మ్యాచ్‌లోనే జరిమానా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమావళి ప్రకారం ధోనీకి జరిమానా విధించినట్లు అధికారిక ప్రకటన సైతం విడుదల చేశారు.
ఖరీదైన టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్లు టైటిల్‌పై కన్నేశారు. నేటి రాత్రి 7:30 గంటల నుంచి ఐపీఎల్ సీజన్ 14 ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Virat Kohli becomes brand ambassador of VIVO: ఐపిఎల్ 2021 టైటిల్ స్పాన్సర్ వివో మరో తెలివైన నిర్ణయం తీసుకుంది. ఐపిఎల్ 2021 ప్రారంభం కావడానికి సరిగ్గా రెండు రోజుల ముందే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తమ వివో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఐపిఎల్‌లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆ క్రేజీని క్యాష్ చేసుకునేందుకు వివో ఈ నిర్ణయం తీసుకుంది.
Sunrisers Hyderabad Full Squad | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగుతూ సంచలనాలు నమోదు చేసే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021లో మరోసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో గత ఏడాది కీలక ఆటగాళ్లు గాయంతో దూరమైనా ప్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టైటిల్ పోరుకు చేరలేకపోయింది. ఈ ఏడాది ఆ లోటును భర్తీ చేసేందుకు సన్‌రైజర్స్ సిద్ధంగా ఉంది.
Big Relief For Mumbai Indians Players And Support Staff | ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌కు మూడు రోజుల ముందు నిర్వహించిన కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి నెగటివ్‌గా తేలింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.
ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. 5 టైటిల్స్ సాధించి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ముంబై ఇండియన్స్ మరోసారి బరిలో దిగుతోంది. ఏప్రిల్ 9న తమ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది.
CSK Latest News | తాజా సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్‌వుడ్ ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరం కానున్నాడు.
IPL 2021 Sanju Samson : ముఖ్యంగా యువ ఆటగాళ్లకు, అదీ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లకు కెప్టెన్సీ పగ్గాలు చేతికివ్వడం శుభపరిణామంగా చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్టీవ్ స్మిత్‌ను వదులుకుంది.
IPL 2021 Chennai Super Kings | చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ టాలెంటెడ్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎస్కే ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ పలు ఆసక్తికర విశేషాలు షేర్ చేసుకున్నాడు.
Mohammed Shami Latest Update : ఈ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే ఓ కీలక అప్డేట్ ఇచ్చాడు. పంజాబ్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2021లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని కుంబ్లే వెల్లడించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.