Chris Gayle: మరో అరుదైన ఘనతను సాధించిన యూనివర్సల్ బాస్

క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.

Last Updated : Oct 31, 2020, 12:24 PM IST
Chris Gayle: మరో అరుదైన ఘనతను సాధించిన యూనివర్సల్ బాస్

Chris Gayle 1000 sixes record in T-20's format: న్యూఢిల్లీ: క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే. బౌలర్ ఎవరైనా సరే సునాయసంగా సిక్సులు, ఫోర్లు కొట్టడమే ఈ కరేబీయన్ స్టార్ స్టైల్.. అందుకే గేల్ యూనివర్సల్ బాస్‌గా నిలిచాడు. అలాంటి స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ టీ 20 ఫార్మాట్‌లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో వెయ్యి సిక్స‌ర్లు (1000 ) కొట్టిన తొలి క్రికెట‌ర్‌గా క్రిస్ గేల్ అరుదైన రికార్డు సృష్టించాడు. 

ఈ ఏడాది ఐపీఎల్‌ (IPL 2020) లో పంజాబ్ త‌ర‌పున ఆడుతున్న గేల్‌ మరోసారి బంతికి చుక్కలు చూపించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. శుక్ర‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో (KXIP vs RR) జ‌రిగిన మ్యాచ్‌లో 99 ర‌న్స్ చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో గేల్ ఎనిమిది సిక్స‌ర్లు కొట్టి 1000 సిక్సర్ల మార్క్‌ను దాటాడు. ఈ మేరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంఛైజీ (Kings XI Punjab) ట్విట్టర్ వేదికగా సిక్సర్ల లెజెండ్ క్రిస్ గేల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. చిన్న వీడియోను రిలీజ్ చేసింది. దీంతోపాటు ఐసీసీ (ICC) కూడా ఇంతకంటే ఎం చెప్పలేమంటూ.. ట్విట్టర్ వేదికగా యూనివర్సల్ బాస్‌ను పేర్కొంది. 

అయితే సిక్స‌ర్ల జాబితాలో గేల్ మొదటిస్థానంలో ఉండగా.. మ‌రో వెస్టెండీస్ ఆట‌గాడు కీర‌న్ పోలార్డ్ (Kieron Pollard) రెండ‌వ స్థానంలో ఉన్నాడు. పోలార్డ్ ఖాతాలో 690 సిక్స‌ర్లు ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీలో ప్ర‌స్తుతం పోలార్డ్ ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడుతున్నాడు. ఇక మూడో స్థానంలో 485 సిక్సర్లతో బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ (Brendon McCullum) ఉన్నాడు. అయితే ప్రస్తుతం మెక‌ల్ల‌మ్ న్యూజిలాండ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతోపాటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కోచ్‌గా సైతం వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఐపీఎల్ సిక్సర్ల జాబితాలో భారత ఆటగాళ్లు ఎవరూ కూడా 500మార్క్ దాటలేదు. ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఒక్కడే అత్య‌ధికంగా 376 సిక్స‌ర్లతో ముందున్నాడు. Also read: KXIP VS KKR: కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News