IPL 2020 టైటిల్ ముంబై ఇండియన్స్ నెగ్గుతుంది: హార్దిక్‌ పాండ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ ఈసారి కూడా తమదేనంటున్నాడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). అవును మరి ఆ జట్టు ఫైనల్‌కు చేరిందంటే కప్పు ఎగరేసుకుపోవడం దాదాపుగా ఖాయం. అందులోనూ గత 7 ఐపీఎల్ ట్రోఫీలలో నాలుగు టైటిల్స్ ముంబై ఇండియన్స్ నెగ్గడం గమనార్హం.

Last Updated : Nov 5, 2020, 05:50 PM IST
IPL 2020 టైటిల్ ముంబై ఇండియన్స్ నెగ్గుతుంది: హార్దిక్‌ పాండ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ ఈసారి కూడా తమదేనంటున్నాడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). అవును మరి ఆ జట్టు ఫైనల్‌కు చేరిందంటే కప్పు ఎగరేసుకుపోవడం దాదాపుగా ఖాయం. అందులోనూ గత 7 ఐపీఎల్ ట్రోఫీలలో నాలుగు టైటిల్స్ ముంబై ఇండియన్స్ నెగ్గడం గమనార్హం. ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టు కూడా ముంబై. రోహిత్ శర్మ సారథ్యంలో ఆ జట్టు అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ముంబై జట్టు ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. 

 

నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తొలి క్వాలిఫయర్ 1 మ్యాచ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ముంబై ఇండియన్స్ ట్విట్టర్ వేదికగా వీడియో షేర్ చేసింది. అందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. అసలైన పోరు ఇప్పుడు మొదలైంది. కీలక దశకు వచ్చేశాం. ఈ ఏడాది కూడా కప్పు సాధించే అవకాశం ముంబై ఇండియన్స్‌కే ఉందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ముంబై ఆడే తీరు చూసిన ఎవరికైనా నిజమే అనిపిస్తోంది.

 

నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ చేరుకుంటుంది. అయితే ముంబై జట్టులో రోహిత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డికాక్, కీరన్ పోలార్డ్, పాండ్యా సోదరులు, జస్ప్రిత్ బూమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి మ్యాచ్ విన్నర్లతో నిండుకుండలా ఉంది. దీంతో వీరితో మ్యాచ్ అంటే ఎవరికైనా కాస్త బెరుకుగా ఉంటుంది. అయితే లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడతంతో సన్‌రైజర్స్ చేతిలో ముంబై ఓటమిపాలైంది. నేటి రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై తలపడుతున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News