Rohit Sharma: ఆ ప్లేయర్స్‌కు సైతం ధన్యవాదాలు తెలిపిన రోహిత్ శర్మ

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. తద్వారా 5 పర్యాయాలు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులను ప్రశంసించారు.

Last Updated : Nov 12, 2020, 06:14 PM IST
  • ముంబై జట్టుకు ఐదో ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ
  • డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్‌ను నిలబెట్టుకున్న ముంబై జట్టు
  • ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సంతోషంగా రోహిత్ శర్మ
Rohit Sharma: ఆ ప్లేయర్స్‌కు సైతం ధన్యవాదాలు తెలిపిన రోహిత్ శర్మ

ఐపీఎల్‌ (IPL 2020)లో విజయవంతమైన కెప్టెన్ అని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాడు రోహిత్ శర్మ మరోసారి నిరూపించుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. తద్వారా 5 పర్యాయాలు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ (Rohit Sharma) డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులను ప్రశంసించారు. సహాయక సిబ్బందికి రోహిత్ ధన్యవాదాలు తెలిపాడు.

 

ఇన్ని రోజులపాటు తమకు అన్ని విధాలుగా మద్దతు తెలిపి, అంతా విజయవంతం కావడంతో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని రోహిత్ పేరుపేరున ధన్యవాదాలు తెలిపాడు. అంతటితో ఆగకుండా ఈ ఐపీఎల్ సీజన్‌లో జట్టులో చోటు దక్కని ఆటగాళ్లకు సైతం ధన్యవాదాలు తెలిపాడు. జట్టులో స్థానం దక్కడం అంత సులువు కాలేదని, కొందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వారు అనుకున్నది జరగలేదని పేర్కొన్నాడు. కరోనా సమయంలో క్రమశిక్షణతో మెలిగిన జట్టు ఆటగాళ్లను, సహాయక, టెక్నికల్ సిబ్బందిని ప్రశంసించాడు రోహిత్.

 

కాగా, ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. తొలిసారి ఫైనల్ చేరిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు, అనుభవంతో కూడిన రోహిత్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ను నిలువరించలేకపోయింది. టోర్నీ మధ్యలో గాయంతో వైదొలిగిన కెప్టెన్ రోహిత్ శర్మ అనంతరం కోలుకుని బరిలోకి దిగడం జట్టుకు ప్లస్ పాయింట్ అయింది. ఫైనల్లో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News