SRH vs DC Match Prediction IPL 2020: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి సన్‌రైజర్స్.. ఢిల్లీపై హ్యాట్రిక్‌ విజయంపై గురి!

SRH vs DC Match Preview | ఢిల్లీలో మ్యాచ్ విన్నర్లు ఉన్నా.. నిలకడలేమీ ప్రధాన సమస్యగా మారింది. ధావన్, అయ్యర్, షా, పంత్ రాణించాల్సి ఉంటుంది. వీరికి తోడు స్టోయినిస్ ఆల్ రౌండ్ ప్రదర్శన అవసరం. జేసన్ హోల్డర్ రాకతో జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మరింత పటిష్టమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, విలియమ్సన్, మనీష్ పాండే, హోల్డర్, బ్యాటింగ్‌లో హైదరాబాద్‌కు ప్రధాన బలం.

Last Updated : Nov 8, 2020, 03:43 PM IST
  • ఫైనల్ బెర్త్ కోసం ఢిల్లీ, సన్‌రైజర్స్ మధ్య పోరు
  • లీగ్ దశలో ఢిల్లీని 2సార్లు కంగుతినిపించిన సన్‌రైజర్స్
  • తొలిసారి ఫైనల్ చేరాలని ఆశగా చూస్తున్న ఢిల్లీ టీమ్
SRH vs DC Match Prediction IPL 2020: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి సన్‌రైజర్స్.. ఢిల్లీపై హ్యాట్రిక్‌ విజయంపై గురి!

DC vs SRH Match Prediction | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరో టైటిల్‌పై కన్నేసింది. అందుకు మరో రెండు అడుగు వేయాలి. ముందుగా నేటి రాత్రి జరగనున్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)పై విజయం సాధించాలి. ఐపీఎల్ 2020 (IPL 2020) క్వాలిఫయర్ 2లో విజయం సాధిస్తే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ()ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరని ఢిల్లీని సన్‌రైజర్స్ కట్టడి చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

 

ఐపీఎల్ 2020 లీగ్ దశలో తొలి 9 మ్యాచ్‌లలో కేవలం 3 మ్యాచ్‌లు సన్‌రైజర్స్ నెగ్గగా, ఢిల్లీ మాత్రం 7 మ్యాచ్‌లు నెగ్గి అగ్రస్థానంలో నిలిచింది. లీగ్ దశ ముగిసేసరికి సన్‌రైజర్స్ 7 విజయాలు సాధిస్తే, ఢిల్లీ 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే లీగ్ చివరి మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ ఓడించింది మామూలు జట్లని కాదు. ప్లే ఆఫ్స్ చేరిన మిగతా 3 జట్లపై విజయాలతోనే సన్‌రైజర్స్ ఈ దశకు చేరుకుంది. మరోవైపు ఢిల్లీ లీగ్ దశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి, ఆర్సీబీపై నెగ్గి ప్లే ఆఫ్స్ చేరింది. క్వాలిఫయర్ 1లో ముంబై ఇండియన్స్ చేతిలో పేలవ ప్రదర్శన చేసి దారుణంగా పరాజయం పాలైంది. 

IPL 2020 Final: ఎంఎస్ ధోనీ ఉంటే రోహిత్‌‌దే విజయం.. కానీ ఈ ఫైనల్ సంగతేంటి!

 

వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించి హైదరాబాద్ జోరు మీదుంది. మరోవైపు వరుస ఓటములతో ఢిల్లీ ఆత్మరక్షణ ధోరణీలో వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు, వన్ డౌన్ ఆటగాళ్లు గత 5 మ్యాచ్‌ల నుంచి ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ధావన్ రెండు శతకాలు చేసినా సీజన్‌లో 4 పర్యాయాలు డకౌట్ అయ్యాడు. పృథ్వీ షా 3 సార్లు, రహానే 2 సార్లు ఖాతా తెరవలేదని తెలిసిందే. దీంతో కేవలం బౌలింగ్‌నే నమ్ముకుంటే ఓటమి తప్పదని ఢిల్లీకి ఈపాటికే అర్థమైంది. మరోవైపు పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్‌తో తలపడటం అంత తేలిక కాదని ఢిల్లీకి తెలుసు.

 

లీగ్ దశలో తలపడిన రెండు మ్యాచ్‌లలో ఢిల్లీపై సన్‌రైజర్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి మ్యాచ్‌లో 15 పరుగులతో నెగ్గగా, రెండో మ్యాచ్‌లో 88 పరుగులతో భారీ విజయాన్ని హైదరాబాద్ నమోదు చేసింది. జేసన్ హోల్డర్ రాకతో జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మరింత పటిష్టమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, విలియమ్సన్, మనీష్ పాండే, హోల్డర్, బ్యాటింగ్‌లో హైదరాబాద్‌కు ప్రధాన బలం. సాహో గాయం నుంచి కోలుకోకపోతే శ్రీవత్స్ గోస్వామికి చోటు దక్కుతుంది. సందీప్ శర్మ బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్నాడు. పవర్ ప్లే‌లో అతడు వికెట్లు సాధిస్తే జట్టుకు తిరుగుండదు. టి నటరాజన్, హోల్డర్, రషీద్‌లు పరుగులు నియంత్రించడంతో పాటు వికెట్లు త్వరగా తీయాల్సి ఉంటుంది.

 

ఢిల్లీలో మ్యాచ్ విన్నర్లు ఉన్నా.. నిలకడలేమీ ప్రధాన సమస్యగా మారింది. ధావన్, అయ్యర్, షా, పంత్ రాణించాల్సి ఉంటుంది. వీరికి తోడు స్టోయినిస్ ఆల్ రౌండ్ ప్రదర్శన అవసరం. బౌలింగ్‌లో కగిసో రబాడ,  నోర్జే, అశ్విన్ హైదరాబాద్ టాపార్డర్ పని పడితే తొలిసారి ఢిల్లీ జట్టు ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్తుంది. గత ఐపీఎల్‌లో నాకౌట్‌ దశలో హైదరాబాద్‌ను ఢిల్లీ దెబ్బ తీసింది. విశాఖలో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఢిల్లీ విజయం సాధించింది.

IPL 2020 Playoff: RCB ఈసారి కూడా టైటిల్‌ కొట్టేలా లేదు: మాజీ కెప్టెన్

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా)
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (కీపర్) / శ్రీవత్స్ గోస్వామి, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియం గార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్
 
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (అంచనా)
పృథ్వీ షా / అజింక్యా రహానె, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), స్టోయినిస్, రిషబ్ పంత్ (కీపర్), అక్షర్ పటేల్, డేనియల్ సామ్స్ / హెట్‌మెయిర్, కగిసో రబాడ, హర్షల్ పటేల్ / తుషార్ దేశ్‌పాండే, అన్రిచ్ నోర్జే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News