/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

IPL 2020: Chennai Super Kings beat Kings XI Punjab: అబుదాబి: ఐపీఎల్‌ (IPL 2020) సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా ఇంటి బాట పట్టింది. అయితే చెన్నై ముందుగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లీగ్ చివరి దశలో అద్భుత ఫాంలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings ) జట్టు.. ముందు నుంచి రాణిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ (Kings XI Punjab) ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయాన్ని చవి చూసిన.. పంజాబ్ ప్లే ఆఫ్ రేసు నుంచి ఔటైన రెండో జట్టుగా నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం వేదికగా చెన్నై, పంజాబ్ జట్లు ఆదివారం తలపడ్డాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. దీపక్‌ హూడా (30 బంతుల్లో 62 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకంతో రాణించగా.. ఓపెనర్లు రాహుల్ ‌(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అగర్వాల్‌(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) పరవాలేదనిపించారు. చెన్నై బౌలర్లల్లో ఎంగ్డీ మూడు వికెట్లు పడగొట్టగా.. తాహీర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జడేజా ఒకటి చొప్పున వికెట్లు‌ సాధించారు. 

లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన చెన్నై జట్టు 18.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి అద్భుత విజయాన్ని సాధించింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (49 బంతుల్లో 62 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), డుప్లెసిస్‌ (34 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో వరుసగా మూడో అర్ధశకతం చేసిన గైక్వాడ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. Also read: Rajasthan Royals: ఐపిఎల్‌ 2020 నుంచి రాజస్థాన్ రాయల్స్ ఔట్

టాస్‌ గెలిచి సీఎస్‌కే తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 48 పరుగులు చేశారు. ఆ తర్వాత ఎంగ్డీ బౌలింగ్‌లో.. అగర్వాల్‌ ( 26 ) ఔటయ్యాడు. ఆ కాసేపటికి రాహుల్‌ (29‌) కూడా ఎంగ్డీ క్లీన్‌బౌల్డ్‌ అయితే పెవిలియన్‌ చేరాడు. ఇక క్రిస్‌ గేల్‌(12), పూరన్‌ (2), మన్‌దీప్‌ సింగ్‌ (14), నీషమ్‌ (2) రాణించకపోవడంతో పంజాబ్‌ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో దీపక్‌ హుడా (62 నాటౌట్‌; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడు మాత్రమే పరుగులు సాధించడంతో పంజాబ్‌ జట్టు కనీసం 153 పరుగులు చేయగలిగింది. ఇదిలాఉంటే.. సీఎస్‌కే ఆరు విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే వరుసగా చెన్నైకు ఇది మూడో విజయం కావడం విశేషం. Also read : MS Dhoni about IPL 2021: వచ్చే ఏడాది ఐపిఎల్‌లో పాల్గొనడంపై స్పందించిన ధోనీ

 Also read : SRH Playoffs: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంత ఈజీ కాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Section: 
English Title: 
Indian Premier League 2020: Kings XI Punjab out of playoff contention after 9-wicket thrashing by Chennai Super Kings
News Source: 
Home Title: 

IPL 2020: చెన్నై బాటలోనే పంజాబ్.. టోర్నీ నుంచి ఔట్

IPL 2020: చెన్నై బాటలోనే పంజాబ్.. టోర్నీ నుంచి ఔట్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
IPL 2020: చెన్నై బాటలోనే పంజాబ్.. టోర్నీ నుంచి ఔట్
Publish Later: 
No
Publish At: 
Monday, November 2, 2020 - 04:52