KXIP VS KKR: కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

ఐపీఎల్ 13వ సీజన్‌లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్‌ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్‌ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.

Last Updated : Oct 27, 2020, 05:55 AM IST
KXIP VS KKR: కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

IPL 2020: Kings XI Punjab beat Kolkata Knight Riders by 8 wickets: షార్జా: ఐపీఎల్ (IPL) 13వ సీజన్‌లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్‌ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్‌ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2020) మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌ ( Kolkata Knight Riders) పై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఆటగాళ్లు మన్‌దీప్‌ సింగ్‌, క్రిస్‌ గేల్‌ (Mandeep Singh, Chris Gayle) అర్థశతకాలతో రాణించి.. సూపర్ పార్టనర్‌షిప్‌తో జట్టును సునాయసంగా గెలిపించారు. Also read: Suriya Movie: ఆసక్తికరంగా ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్

మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన (KXIP VS KKR) కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శుభారంభం కాలిసిరాలేదు. రెండు ఓవర్లల్లోనే ఆజట్టు 3  వికెట్లను పొగట్టుకుంది. మొత్తం మీద 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్‌ మోర్గాన్‌ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో షమీ 3, జోర్డాన్‌, రవి బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లను పడగొట్టారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ సునాయసంగా మ్యాచ్‌ను గెలిచింది. 18.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి గెలిచింది. మన్‌దీప్‌ సింగ్‌ (56 బంతుల్లో 66 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రిస్‌ గేల్‌ (Chris Gayle) (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో ఇరగదీశారు. మొదట రాహుల్ అవుటైన తర్వాత వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగుల పార్టనర్‌షిప్‌తో అద్భుతంగా ఆడారు. చివర్లో గేల్‌ ఔటయ్యాక పూరన్‌ (2 నాటౌట్‌) దిగాడు. అయితే బ్యాట్‌తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడిన (51) గేల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' దక్కింది. Also read: Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..

ఇదిలాఉంటే ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లల్లో ఆరు విజయాలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా 6విజయాలతో 5 స్థానంలో ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News