IND vs BAN: హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచులో భారత్ జట్టు బంగ్లాదేశ్ ముందు భారీ స్కోరును ఉంచింది. సంజూశాంసన్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా సంజూ నిలిచాడు. సంజూ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి మొత్తం 111 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 75 పరుగులతో విజ్రుంభించాడు. కాగా 6 వికెట్లు కోల్పోయిన భారత నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేసింది.
KL Rahul Retirement : భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా. తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు పలు అనుమానాలకు తావిస్తోంది. రాహుల్ ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అని క్రికెట్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. దీనికి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
You Know MS Dhoni Mother In Law Sheila Singh Famous Business Woman: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశ విదేశాల్లో కోట్లాది అభిమానులు ఉన్నారు. అతడి గురించి అందరికీ తెలుసు. కానీ అతడి అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న అత్త గురించి తెలుసుకుందాం.
Gautam Gambhir Appointed As Team India Head Coach: భారత క్రికెట్లో.. ఐపీఎల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌కే హెడ్ కోచ్ పదవి వరించింది. ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం.
Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ పదవిపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.
IPL 2024: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.. టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ లో మాత్రం సత్తా చాటారు. అదెలాగంటే?
T20 World Cup 2024: జూన్ 01 నుంచి యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024 టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే జట్లన్నీ టీమ్స్ ను ప్రకటించాయి.
T20 WC 2024: టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు ఎలా ఉండబోతుందనే విషయంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఎవరెవరికి చోటు దక్కిందంటే?
T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
Virat Kohli: ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీకి కోహ్లీని పక్కకు పెట్టాలని భావిస్తుందట బీసీసీఐ. దానికి ఓ కారణం చెబుతోంది. అది ఏంటంటే?
Cricket News: అంతర్జాతీయ క్రికెట్లో సంచలన ప్రదర్శనతో ఆస్ట్రేలియా సత్తా చాటుతోంది. గతేడాది సీనియర్ భారత జట్టుకు భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచకప్‌ను కూడా వదలలేదు. యువ ఆటగాళ్లపై కూడా ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన నేపథ్యంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. తన జెర్సీని గిఫ్ట్ గా అందజేశాడు.
ICC T20s Best Team: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ 2023 టీ20 అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు భారత స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ సారథిగా ఎంపికవడం విశేషం. ఈ జట్టులో భారత్ నుంచే అత్యధిక ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. ఈ జట్టులో మన పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జట్టు వివరాలు ఇలా..
Ind Vs Sa: రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న టెస్టు మ్యాచ్ లో పలు రికార్డులపై కన్నేశాడు కింగ్ కోహ్లీ. ద్రావిడ్, సెహ్వాగ్ రికార్డులను చెరిపేసేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నాడు విరాట్.
IND vs AUS: మరో నాలుగు రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.
Team India: గత నెలలో జరగాల్సిన భారత్, ఆఫ్ఘనిస్థాన్ వన్డే సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. ఆసియా క్రీడల్లో భారత్ జట్టు పాల్గొంటుందా లేదా అనే విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.
Team India new sponsor: టీమిండియా కొత్త స్పాన్సర్‌ను బీసీసీఐ ఎనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 స్పాన్సర్‌గా వ్యవహారించనుంది. ఇది మూడేళ్లపాటు ఉంటుంది.
ICC World Test Championship 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఐదుగురు ఆటగాళ్లకు జట్టులో స్థానంలో కల్పించింది. రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్‌లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది.
Rohit Sharma Run Out For Pujara: పుజారా తన వందో టెస్టును చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. విన్నింగ్ షాట్ బౌండరీతో జట్టును గెలిపించాడు. అంతకుముందు రోహిత్ శర్మ తన వికెట్‌ను పుజారా కోసం త్యాగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.