Team India Head Coach: అందరూ ఊహించినట్టు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఐపీఎల్‌లో విజయవంతమైన మెంటర్‌గా గౌతమ్ గంభీర్ ప్రత్యేకత సాధించాడు. తాజా ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ట్రోఫీ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన గంభీర్‌కే భారత హెడ్ కోచ్ పదవి వరించింది. రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత జట్టుకు ప్రధాన శిక్షకుడిగా గంభీర్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు.
Also Read: Mohammed Siraj: క్రికెటర్ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్.. రేవంత్ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు స్వాగతం పలుకుతున్నా అని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. 'క్రికెట్ జీవితంలో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్ భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. ఆయన అనుభవం జట్టుకు ఎంతో దోహదం చేస్తుందని భావిస్తున్నా. బీసీసీఐ ఆయనకు అన్ని విధాల సహకరిస్తుంది' అని జై షా 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా గంభీర్‌తో ఉన్న ఫొటోను పంచుకున్నారు. టీ 20 ప్రపంచకప్‌తో తన ప్రధాన కోచ్ పదవి ముగియడంతో మళ్లీ కొనసాగడానికి రాహుల్ ద్రవిడ్ నిరాకరించారు.
Also Read: Virat kohli: విరాట్ కోహ్లి పబ్ పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రధాన కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. చాలా దరఖాస్తులు వచ్చినప్పటికీ చివరికి గంభీర్ వైపు బీసీసీఐ మొగ్గు చూపింది. భారత జట్టు శ్రీలంక పర్యటనకు గంభీర్ నేతృత్వంలోనే వెళ్లనుంది. అయితే సహాయ కోచ్‌ల విషయమై బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. బౌలింగ్, బ్యాటింగ్ వంటి సహాయ కోచ్‌ల ఎంపిక గంభీర్‌కే వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా తనను హెడ్ కోచ్‌గా నియమించడంపై గంభీర్ 'ఎక్స్'లో స్పందించారు.
'భారతదేశమే నా గుర్తిపు. నా దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. వేరే టోపీ పెట్టుకున్నా.. మళ్లీ సొంత ఇంటికి రావడం గర్వంగా ఉంది. ప్రతి భారతీయుడిని గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే నా ముందు ఉన్న ప్రధాన లక్ష్యం. 1.4 కోట్ల మంది భారతీయుల కలలు, ఆశలు భారత క్రికెటర్ల భుజాలపై ఉన్నాయి. వారి కలలను నిజం చేయడానికి నా శక్తి మేర ప్రయత్నం చేస్తా' అని గంభీర్ 'ఎక్స్'లో పోస్టు చేశారు.
గంభీర్ నేపథ్యం
భారత క్రికెటర్‌గా గౌతమ్ గంభీర్ జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. 2007లో టీ20 ప్రపంచకప్, 2001 వన్డే ప్రపంచకప్‌లు సాధించిన జట్టులో గౌతమ్ సభ్యుడు. ఐండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏడు సీజన్లకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. రెండు సార్లు జట్టును విజేతగా నిలిపిన గంభీర్ 17వ ఐపీఎల్ సీజన్‌లో మెంటార్‌గా అవతారమెత్తి మళ్లీ కేకేఆర్‌కు ట్రోఫీని అందించారు. కోచ్‌గా అనుభవం లేకపోయినా.. ఆటగాడిగా.. కెప్టెన్‌గా.. మెంటార్‌గా విశేష అనుభవం ఉండడంతో హెడ్ కోచ్‌గా గంభీర్ విజయం సాధిస్తాడని బీసీసీఐతోపాటు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి