Karun Nair: బ్యాటింగ్ యావరేజ్ 752..! వామ్మో... ఏం మాట్లాడుతున్నారండి.. బ్యాటింగ్ యావరేజ్ 752 ఎలా ఉంటుంది? అసలు అంత యావరేజ్ ఉంటే అతను టీమ్‌లో లేకుండా ఉంటాడా అని ఆలోచిస్తున్నారా? అయ్యో.. ఎందుకు ఉండరండి.. ఉంటారండి.. ఉన్నారు కూడా! కరుణ్ నాయర్ గుర్తున్నాడు కదా? టీమిండియా తరుఫున టెస్టుల్లో త్రిపుల్ సెంచరీ చేసిన ఈ టాలెంటెడ్ గన్ తర్వాత ఎందుకో తెలియదు కానీ జట్టులోనే లేకుండా పోయాడు. అసలు కరుణ్ నాయర్‌ను ఎందుకు తప్పించారన్నది ఇప్పటికీ ఓ మిస్టరీనే. తనకు మరో అవకాశం ఇవ్వాలని కరుణ్ నాయర్ ఓపెన్‌గానే బీసీసీఐను వేడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే బీసీసీఐ నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ లేకున్నా ఎవరి అండదండలు లేకున్నా కరుణ్ నాయర్ మరోసారి తన ఆటతోనే డొమెస్టిక్ క్రికెట్లోకి దూసుకొచ్చాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. విదర్భ కెప్టెన్‌గా అటు నాయకత్వంలోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ సెలక్టర్లకు, బీసీసీఐకు సవాల్ విసురుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లోనూ కరుణ్ నాయర్ బౌలర్లపై ఏ మాత్రం జాలి, దయ లేకుండా విరుచుకుపడ్డాడు. వరుసగా 112, 44, 163, 112, 122, 88 పరుగులతో మొత్తం 752 పరుగులు చేశాడు. ఈ ఏడు ఇన్నింగ్స్‌లో ఒక్కసారి మాత్రమేకరుణ్ నాయర్‌ను ప్రత్యర్థి బౌలర్లు అవుట్ చేయగలిగారు. మిగిలిన ఆరుసార్లు కూడా అతను నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అతని యావరేజ్ ఏకంగా 752కు చేరింది.
Also Read: DK Aruna: 'రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కుట్రలు చేసినా ఢిల్లీ పీఠం మాదే'
నిజానికి కరుణ్ నాయర్ చాలా గొప్ప క్రికెటర్ అవుతాడని అంతా భావించారు. 2016లో డిసెంబర్ 19న చెన్నై వేదికగా ఇంగ్లండ్‌పై జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 303 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాడు. ఇది జరిగి 8ఏళ్లు దాటినా ఇప్పటివరకు మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు నాయర్. అసలు కారణమేంటో బీసీసీఐ చెప్పలేదు కూడా. జట్టులో లేనన్న బాధతో డీలా పడిపోయిన కరుణ్ నాయర్ ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్లోనూ రాణించలేకపోయాడు. కానీ గొడకేసి కట్టిన బంతిలా రయ్‌రయ్‌మని దూసుకొచ్చిన కరుణ్ నాయర్ దేశవాళీ మ్యాచ్‌ల్లో తన సత్తా చూపించడం మొదలుపెట్టాడు. మునుపెన్నడూ చూడని కరుణ్ నాయర్‌ని చూపిస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ నుంచి అతనికి సపోర్ట్ పెరిగింది.
Also Read: Chandrababu Tour: వైఎస్ జగన్ అడ్డాలో సీఎం చంద్రబాబు.. రేపు ఏం జరగనుంది?
అటు మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ సైతం కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నాడు. రోహిత్-కోహ్లీ దారుణంగా ఆడుతున్నా వాళ్లని మాత్రం కొనసాగిస్తున్నారని.. పైగా జాలి చూపిస్తున్నారని మండిపడ్డాడు. ఇటు డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్న కరుణ్ నాయర్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదో తనకు అంతుబట్టడం లేదని భజ్జి ఫైర్ అయ్యాడు. అందరికి రూల్స్ సమానంగా ఉండాలని చురకలంటించాడు. ఇక ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు కచ్చితంగా కరుణ్ నాయర్‌ను ఎంపిక చేయాల్సిందేనని ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. టాటూలు వేసుకుంటేనే జట్టులోకి తీసుకుంటారేమోనని పరోక్షంగా కోహ్లీ చెత్త ఫామ్‌ను ప్రశ్నిస్తూ బీసీసీఐకి కౌంటర్లు ఇస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.