World Cup: చిన్న కప్పును కూడా తన్నుకుపోయిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో భారత్‌కు నిరాశ

Cricket News: అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన ప్రదర్శనతో ఆస్ట్రేలియా సత్తా చాటుతోంది. గతేడాది సీనియర్‌ భారత జట్టుకు భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా అండర్‌-19 ప్రపంచకప్‌ను కూడా వదలలేదు. యువ ఆటగాళ్లపై కూడా ఆసీస్‌ ఆధిపత్యం చెలాయించింది.

Last Updated : Feb 11, 2024, 11:24 PM IST
World Cup: చిన్న కప్పును కూడా తన్నుకుపోయిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో భారత్‌కు నిరాశ

Under 19 Cricket World Cup: అత్యంత రసవత్తరంగా సాగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో తుది మెట్టుపై భారత యువ జట్టు బోల్తా కొట్టింది. 79 పరుగుల తేడాతో భారత్‌ను ఆస్ట్రేలియా కుర్రాళ్లు ఓడించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన యువ భారత జట్టు 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి నిరాశ మిగిల్చింది. ఆఖరి మెట్టులో బోల్తా కొట్టగా కుర్రాళ్లయినా కప్‌ సాధిస్తారంటే వాళ్లు కూడా నిరాశే మిగిల్చారు.

Also Read: India vs Australia: ప్రతీకారం తీర్చుకునేందుకు కుర్రాళ్లు సిద్ధం.. నేడే అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తరఫున హర్జస్‌ సింగ్‌ (55), హగ్‌ వెబ్‌జెన్‌ (48), ఓలి పీక్‌ (46) హ్యారీ దిక్సన్‌ (42) పరుగులు రాబట్టారు.  ఆస్ట్రేలియాను పరుగులు చేయకుండా భారత బౌలర్లు కట్టుదిట్టం చేశారు. రాజ్‌ లింబానీ మూడు వికెట్లు పడగొట్టగా, నమన్‌ తివారీ రెండు వికెట్లు తీశాడు. సౌమి కుమార్‌ పాండే, ముషీర్‌ ఖాన్‌ చెరో వికెట్‌ తీశారు. ఛేదనకు దిగిన భారత జట్టును ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టం చేశారు. పరుగులు చేయకుండా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగారు. ఆదర్శ్‌ సింగ్‌ (47), మురుగన్‌ పెరుమాల్‌ అభిషేక్‌ (42) అత్యధిక స్కోరర్లుగా నిలిచారు. మహిల్‌ బియార్డ్‌మన్‌, రఫేల్‌ మక్‌మిలన్‌ మూడు వికెట్ల చొప్పున తీశారు.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

గతేడాది నవంబర్‌ 19న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురుకాగా.. యువ జట్టును ఆ పరువు తీరుస్తుందనుకుంటే నిరాశే మిగిలింది. సీనియర్ల కసిని కుర్రాళ్లు తీర్చుకుంటారనుకుంటే ఇక్కడ కూడా పరాభవం ఎదురైంది. నాలుగోసారి అండర్‌ -19 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత యువ జట్టు ఆధిపత్యమే ఉండేది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News