HMPV Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటి

HMPV Symptoms: చైనాలో విస్తృతంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ ఇప్పుడు ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపిస్తోంది. కరోనా మహమ్మారి తరహాలో ప్రమాదకరంగా మారవచ్చనే ఆందోళన కలుగుతుంది. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలెలా ఉంటాయో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2025, 12:02 PM IST
HMPV Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటి

HMPV Symptoms: హెచ్‌ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమోనస్ వైరస్. కరోనా మహమ్మారి ప్రారంభమైన ఐదేళ్ల తరువాత తిరిగి ఇప్పుడు అదే దేశం నుంచి ముప్పుగా మారుతోంది. ఈ వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటితమైంది. జపాన్, హాంకాంగ్ దేశాల్లో వ్యాపిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇండియాకు సైతం ముప్పు ఉందనే వార్తలు ఆందోళన రేపుతున్నాయి. 

హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రత

హెచ్ఎంపీవీ ఇప్పుడు చైనాలో ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అత్యంత సులభంగా వ్యాపించే వ్యాధి ఇది. కరోనా వైరస్ లక్షణాలే ఇందులో కూడా కన్పిస్తున్నాయి. వైరస్ సంక్రమించిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా గాలి ద్వారా ఈ వైరస్ మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తిని తాకినా, అతని వస్తువుల్ని ముట్టుకున్నా ఈ వ్యాధి సంక్రమించే అవకాశముంది. అందుకే ఈ వ్యాది నుంచి కాపాడుకోవాలంటే సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి మార్గదర్శకాల్ని పూర్తిగా అమలు చేయాలి. చేతులతో ముఖం, కళ్లు, ముక్కు తాకగూడదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకుతుంది. చిన్నారులు, వృద్ధులకు త్వరగా సంక్రమిస్తుంది. 

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు

దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, న్యూమోనియా, లంగ్స్ ఇన్‌ఫెక్షన్ వంటి లక్షణాలు కన్పిస్తాయి. సాధారణంగా చలికాలంలో కన్పించే వైరల్ జ్వరం లక్షణాలే ఉంటాయి. ఇన్‌ఫెక్షన్ సోకిన 3-6 రోజుల తరువాత లక్షణాలు కన్పిస్తాయి. 5 ఏళ్లలోపున్న చిన్నారులపై ప్రభావం అధికంగా చూపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కరోనా వైరస్ లక్షణాలే కన్పిస్తుంటాయి. ఇప్పటి వరకూ ఈ వైరస్‌కు సంబంధించి అటు చైనా ప్రభుత్వం లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also read: AP Health Insurance: ఆరోగ్యశ్రీ అటెక్కినట్టేనా, ఏపీలో బీమా రంగ విధానం అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News