హైదరాబాద్: మోటారు వాహనాల సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించనేలేదు కానీ తాగి వాహనం నడిపే మందు బాబులకు ఆ చట్టంలోని భారీ చలానాల రీతిలోనే భారీ జరిమానా విధించి నాంపల్లి కోర్టు మందు బాబులకు షాక్ ఇచ్చింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇటీవల పోలీసులకు పట్టుబడిన 9 మందికి రూ.10,500 చొప్పున నాంపల్లి కోర్టు చలానాలు విధించింది. డ్రంకన్ డ్రైవ్‌కు భారీ చలానా విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఒకసారి ఈ తరహాలో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారు గనక మరోసారి డ్రంకన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే.. రూ.15 వేల దాకా చలానా విధించే అవకాశాలు లేకపోలేదని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.