ఆమె బిచ్చగత్తె కాదు.. లక్షలకు అధిపతి

హైదరాబాద్ చర్లపల్లి జైలులో యాచకుల పునారావస కేంద్రంలో నివసిస్తున్న ఓ ముసలావిడ వద్ద దాదాపు రూ.2 లక్షల రూపాయల సొమ్ము ఉండడం చూసి ఆశ్రమ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు.

Last Updated : Nov 5, 2018, 10:40 AM IST
ఆమె బిచ్చగత్తె కాదు.. లక్షలకు అధిపతి

హైదరాబాద్ చర్లపల్లి జైలులో యాచకుల పునారావస కేంద్రంలో నివసిస్తున్న ఓ ముసలావిడ వద్ద దాదాపు రూ.2 లక్షల రూపాయల సొమ్ము ఉండడం చూసి ఆశ్రమ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. తాను రోజూ అడుక్కునే సొమ్ము నుండి కొంత మొత్తం పొదుపు చేసుకొనేదానినని ఆమె తెలపడం గమనార్హం. ఈ మధ్యకాలంలో యాచకులను ఆశ్రమాలకు తరలించే పనిని హైదరాబాద్ పోలీసులు చేపట్టారు. ఈ క్రమంలో సదరు వృద్ధురాలిని కూడా ఇటీవలి కాలంలో ఆశ్రమానికి తరలించారు.

అయితే ఆమె వస్తువులను ఆశ్రమ నిర్వాహకులు పరిశీలించగా.. ఆమె వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అది ఆమె సొమ్ము కాబట్టి.. అంత మొత్తం ఆమె వద్ద ఉండడం శ్రేయస్కరం కాదు కాబట్టి.. ఆమె పేరు మీద స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఖాతా ఓపెన్ చేయించి.. ఆ సొమ్మును అందులో డిపాజిట్ చేశారు. మూసారంబాగ్‌ టీవీ టవర్‌ దగ్గర ఒంటరిగా భిక్షాటన చేసుకుంటున్న ఈ వృద్ధురాలిని మరిన్ని వివరాల
కోసం ఎంక్వయరీ చేయగా.. పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ వృద్ధురాలికి కుటుంబం ఉందని.. అలాగే కొడుకులు, కోడళ్లు, మనవళ్లు కూడా ఉన్నారని పోలీసుల ఎంక్వయరీలో తేలింది. అలాగే ఆమె మెడలో వెండి కడియాలు, బంగారు గొలుసు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆమెను ఆశ్రమంలో ఉంచాలా? లేక ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి ఆమెను తిరిగి ఇంటికి పంపించాలన్న విషయాన్ని కూడా ఆలోచించాలని యోచిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఆమె ఆశ్రమంలోనే ఉంటుందని పోలీసులు తెలిపారు.

Trending News