Budget Date 2023: కేంద్ర ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తి డేటా విడుదల తేదిలో పెద్ద మార్పులు చేసింది. జనవరిలో విడుదల చేసే ఈ డేటాను ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Union Budget 2023: విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ సారి బడ్జెట్లో ద్రవ్య లోటును 5.8% నుంచి 6% పరిధిలో ఉంచవచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును స్థూల జీడీపీలో 6.4 శాతంగా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
Revanth Reddy press meet: కేంద్ర బడ్జెట్‌ని విమర్శిస్తూనే అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని పెద్దలపై మాట్లాడిన భాష, ప్రస్తావించిన అంశాలను తీవ్రంగా ఎండగట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ఒకేసారి బీజేపి, టీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Revanth Reddy Reaction on Budget 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై గంటన్నరసేపు ప్రసంగిస్తే.. సీఎం కేసీఆర్ రెండున్నర గంటలు మాట్లాడారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే... నల్ల మందు కలిపిన కల్లు తాగిన వాళ్లు ఎలా వ్యవహరిస్తారో అలాగే అనిపించింది అని రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
CM KCR about Budget 2022: హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ 2022 పై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో చినజీయర్ స్వామి ఏర్పాటు చేస్తోన్న రామానుజా చార్య విగ్రహాన్ని సైతం బీజేపి ప్రచారానికి వాడుకుంటోందని మండిపడ్డారు.
Budget 2022 Political Reaction: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23 చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడిన సీఎం కేసీఆర్.. కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంక్షేమానికి దోహదపడే విధంగా లేదని అన్నారు. తానేమీ కేంద్రంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదని, పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోని గణాంకాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. బడ్జెట్ గురించి సీఎం కేసీఆర్ ఇంకా ఏమేం అన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 848 పాయింట్లు పెరిగి 58,862 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 237 పాయింట్ల లాభంతో 17,577 వద్ద స్థిరపడింది.
బడ్జెట్ 2022-23ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎప్పటిలానే ఈ సారి కూడా బడ్జెట్ నిర్ణయాల వల్ల కొన్ని వస్తు, సేవల ధరలు పెరగటం, మరికొన్నింటి ధరలు తగ్గటం వంటివి జరగనున్నాయి.
Budget 2022: కేంద్ర బడ్జెట్లో పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని పోస్టాఫీసులు బ్యాంకింగ్ వ్యవస్థలుగా మారిపోనున్నాయి. ఈ మేరకు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది.
Budget 2022: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని మండిపడ్డారు.
ECLGS scheme extended for MSMEs: కరోనాతో నష్టపోయిన చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. MSMEs లబ్ధి కోసం కేంద్రం తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ గడువు పొడిగింపుతో పాటు కేంద్రం ఇంకా ఏయే నిర్ణయాలు తీసుకుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Digital Rupee: కేంద్ర బడ్జెట్లో డిజిటల్ కరెన్సీపై ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం మోపిన కేంద్రం..డిజిటల్ రూపీ ప్రవేశపెడుతోంది. అసలు డిజిటల్ రూపీకు..క్రిప్టోకరెన్సీకు ఉన్న వ్యత్యాసమేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
Budget 2022: సగటు ఉద్యోగికి బడ్జెట్ 2022లో నిరాశే ఎదురైంది. తాజాగా ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశాలు కనిపించలేదంటున్నారు విశ్లేషకులు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిద్దాం.
కేంద్ర బడ్జెట్ 2022లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులందరికీ ఈ-కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Budget 2022 Updates: పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ కొనసాగుతోంది. ఇన్‌కంటాక్స్, క్రిప్టోకరెన్సీకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం మోపుతూనే డిజిటల్ కరెన్సీపై ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.