IPS Officers Transfers: పవన్‌ కల్యాణ్‌ దెబ్బ అదుర్స్‌.. కాకినాడ జిల్లా ఎస్పీ బదిలీ

27 IPS Officers Transfers In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరోమారు ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. ఈసారి మాట వినిపించుకోని పోలీస్‌ అధికారులపై వేటు పడింది. వారిలో పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ ఎస్పీ కూడా ఉండడం గమనార్హం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 20, 2025, 10:37 PM IST
IPS Officers Transfers: పవన్‌ కల్యాణ్‌ దెబ్బ అదుర్స్‌.. కాకినాడ జిల్లా ఎస్పీ బదిలీ

IPS Officers Transfers: ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తనను గౌరవించకుండా.. తాను వస్తే జిల్లాలో ఉండకుండా ఉంటున్న అధికారిపై పవన్‌ కల్యాణ్‌ ప్రతీకారం తీర్చుకున్నారు. ఇన్నాళ్లు గమనించిన పవన్‌ కల్యాణ్‌ తాజాగా జరిగిన బదిలీల్లో ఆ అధికారి బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. 27 మంది ఐపీఎస్‌ అధికారులకు బదిలీలు, పోస్టింగ్స్‌ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అధికారుల్లో పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కలిగిన కాకినాడ జిల్లా ఎస్పీ ఉన్నారు. ఇక తిరుపతి తొక్కిసలాటలో విఫలమైన పోలీస్‌ అధికారిపై కూడా వేటు పడింది.

Also Read: Nara Lokesh CM: చంద్రబాబుకు 'సన్‌స్ట్రోక్‌'.. సీఎం పదవి రేసులోకి నారా లోకేశ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. 27 మంది ఐపీఎస్ అధికారుల  బదిలీలు.. పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన అధికారులను బదిలీ చేయడం.. కొత్త పోస్టులు ఇవ్వడం గమనార్హం. వారిలో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఉన్నారు. కొన్నాళ్లుగా ఎస్పీకి, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పవన్‌ పర్యటన వేళ ఎస్పీ సెలవుపై వెళ్లడం తీవ్ర చర్చ జరిగింది. తాజాగా జరిగిన బదిలీల్లో విక్రాంత్‌ ఉన్నారు. కాకినాడ నుంచి కర్నూలుకు బదిలీపై పంపించారు. కాకినాడ ఎస్పీగా బిందుమాధవ్ (ఎన్టీవీ) ను నియమించారు.

Also Read: SVSN Varma: పవన్‌ కల్యాణ్‌‌ పోస్టుకు 'పిఠాపురం గండం'.. నారా లోకేశ్‌కు ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ జై!

బదిలీ పోస్టింగులు ఇవే!
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనా 
శాంతి భద్రతల అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి 
టెక్నీకల్ సర్వీసెస్ ఐజీగా శ్రీకాంత్
ఎఫ్ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా పాలరాజు
ఏసీబీ డైరెక్టర్‌గా రాజ్యలక్ష్మీ
ఏపీఎస్పీ ఐజీగా రాజకుమారి 
స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ డీఐజీగా అంబురాజన్ 
గ్రేహౌండ్స్ డీఐజీగా బాబ్జీ 
ఏపీఎస్పీ డీఐజీగా  పకీరప్ప 
కర్నూలు ఎస్పీగా విక్రాంత్ పాటిల్ 
తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు 
ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు
ఏపీఎస్పీ కర్నూలు కమాండెంట్ గా దీపిక 
లీగల్, హ్యూమన్ రైట్స్ కో ఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డి
సీఐడీ ఎస్పీలుగా పరమేశ్వర్ రెడ్డి, శ్రీధర్ 
విశాఖపట్నం డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్ 
అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్ 
అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీష్ 
ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్మోహన్ రావు 
సీఐడీ ఎస్పీగా, శ్రీదేవిరావు, చక్రవర్తి 
కడప ఎస్పీగా అశోక్ కుమార్ 
ఇంటెలిజెన్స్ ఎస్పీగా రమాదేవి 
విజయవాడ డీసీపీ అడ్మిన్‌గా సరిత
కాకినాడ ఎస్పీగా బిందుమాధవ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News