Nara Lokesh CM: చంద్రబాబుకు 'సన్‌స్ట్రోక్‌'.. సీఎం పదవి రేసులోకి నారా లోకేశ్‌!

TG Bharat Demands Nara Lokesh Is Future CM: డిప్యూటీ సీఎం పదవి నుంచి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి లోకేశ్‌ను టీడీపీ నాయకులు మోస్తున్నారు. చంద్రబాబు ముందే లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్‌ వ్యక్తమవడం.. టీజీ భరత్‌ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 20, 2025, 10:15 PM IST
Nara Lokesh CM: చంద్రబాబుకు 'సన్‌స్ట్రోక్‌'.. సీఎం పదవి రేసులోకి నారా లోకేశ్‌!

Nara Lokesh Future CM: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఎన్డీయే కూటమిలో సరికొత్త అంశం కాక రేపుతోంది. నారా లోకేశ్‌ వ్యవహారం ఏపీలో కార్చిచ్చులాగా మారింది. తాజాగా ఆ వివాదానికి మంత్రి టీజీ భరత్‌ మరింత ఆజ్యం పోశాడు. ఈసారి ఏకంగా చంద్రబాబు నాయుడు పదవికే ఎసరు పెట్టారు. భవిష్యత్‌లో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేశ్‌ అని ప్రకటించడంతో కలకలం రేపింది. అది కూడా చంద్రబాబు ముందే వ్యాఖ్యానించడం టీడీపీతోపాటు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది.

Also Read: SVSN Varma: పవన్‌ కల్యాణ్‌‌ పోస్టుకు 'పిఠాపురం గండం'.. నారా లోకేశ్‌కు ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ జై!

దావోస్‌ పర్యటనకు సీఎం చంద్రబాబుతోపాటు నారా లోకేశ్ ఇతర బృందంతో మంత్రి టీజీ భరత్‌ వెళ్లారు. దావోస్‌ చేరుకున్నాక జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మైక్‌ అందుకున్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో 'మాకు కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్‌' అంటూ ప్రకటించారు. 'ఎవరికీ నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్‌ అంతా లోకేశ్‌. భవిష్యత్‌లో కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్‌' అంటూ టీబీ భరత్‌ వ్యాఖ్యానించారు.

Also Read: Amit Shah: అంబేడ్కర్‌ వ్యాఖ్యల చిచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో అమిత్‌ షాకు ఘోర పరాభవం

'ఏపీలోని 175 ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీల్లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివిన వాళ్లు ఎవరూ లేరు. ఒక్క లోకేశ్‌ తప్ప. లోకేశ్‌ చాలా ఉన్నత చదువులు చదివారు. ఆయనకు ఏం చేయాలో.. ఎప్పుడు చేయాలనే దానిపై స్పష్టత ఉంది' అంటూ లోకేశ్‌పై టీజీ భరత్‌ ప్రశంసలు కురిపించారు. విదేశాల్లో టీజీ భరత్‌ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్‌ కల్యాణ్‌కు పోటీగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ లేవనెత్తుతున్న వేళ అనూహ్యంగా ముఖ్యమంత్రి రేసులో లోకేశ్‌ను నిలబెట్టడం కలకలం రేపింది.

తండ్రి చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన పదవికే ఎసరు పెట్టేలా లోకేశ్‌ను ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్‌ రావడం టీడీపీలో కలకలం రేపింది. దూకుడుగా వెళ్తున్న పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకునేందుకు డిప్యూటీ సీఎంగా లోకేశ్‌కు ఇవ్వవచ్చు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి పదవినే లోకేశ్‌కు కోరడం టీడీపీ నాయకులే తప్పుబడుతున్నారు. లోకేశ్‌ భజన కార్యక్రమం చంద్రబాబు పదవికే చేటు చేసేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ డిమాండ్‌ మరింత మలుపు తిరిగే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయం తీసుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News