Union Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ 2022-23ను (Union Budget 2022) పార్లమెంటులో ప్రవేశపెట్టారు. విదేశాలకు వెళ్లేవారి కోసం త్వరలోనే ఎంబెడెడ్ చిప్‌లతో కూడిన ఈ-పాస్‌పోర్ట్ ( E-Passport) విధానాన్ని తీసుకొస్తామని ఆమె తెలిపారు.
అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యం కోసం ఎంబెడెడ్ చిప్‌లతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. త్వరలో భారత పౌరుల కోసం ఈ-పాస్ పోర్టును తీసుకొస్తున్నట్లు ఎంఈఏ (MEA) గతంలోనే ధృవీకరించింది.
కొత్త ఈ-పాస్‌పోర్ట్ ఫీచర్లు:
* సురక్షితమైన బయోమెట్రిక్ డేటా
* ప్రపంచవ్యాప్తంగా సులభతర ఇమ్మిగ్రేషన్ పాసేజ్
* చిప్ ట్యాంపర్ చేయబడితే.. పాస్ పోర్టు అథంటికేషన్ ఫెయిల్ అవుతుంది.
* ఎంబెడెడ్ చిప్‌లతో కూడిన ఈ-పాస్‌పోర్ట్ ను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లో తయారు చేస్తారు.
డిజిటల్ యూనివర్శిటీ ఏర్పాటు
ఈ బడ్జెట్లో (Budget 2022-23) విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థులందరికీ ఈ-కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీని (Digital University) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు టీవీల ద్వారా అనుబంధ విద్యను అందించనున్నట్లు వివరించారు.
Also Read: Budget 2022: గుడ్ న్యూస్: రెండేళ్ల లోపు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చు..
Also Read: Budget 2022 Live Updates: రానున్న మూడేళ్లలో 4 వందల వందేభారత్ రైళ్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook