Budget Date 2023: జీడీపీ డేటా విడుదల తేదీలో మార్పలు చేసిన కేంద్రం.. ఎందుకో తెలుసా?

Budget Date 2023: కేంద్ర ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తి డేటా విడుదల తేదిలో పెద్ద మార్పులు చేసింది. జనవరిలో విడుదల చేసే ఈ డేటాను ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2023, 03:55 PM IST
Budget Date 2023: జీడీపీ డేటా విడుదల తేదీలో మార్పలు చేసిన కేంద్రం.. ఎందుకో తెలుసా?

Budget Date 2023: కేంద్రం ప్రభుత్వ గణాంకాల క్యాలెండర్‌లో పెద్ద మార్పు చేసింది. ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేసే జాతీయ ఖాతా గణాంకాలను ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బీజేపీ ప్రభుత్వానిది ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో ఇప్పటి వరకు ప్రభుత్వ గణాంకాలను వెల్లడించలేదు. కొత్త క్యాలెండర్ ప్రకారం.. స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ(MOSPI) ఈ ఏడాది చివరి ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆదాయం, వినియోగ వ్యయం, పొదుపులు, మూలధన నిర్మాణం మొదటి సవరించిన అంచనాలను ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేయనుంది.

బడ్జెట్‌కు రెండు రోజుల ముందు వచ్చే జనవరి 31 తేదీని మార్చామన.. ఇప్పటిదాకా ఈ సంఖ్యలను లెక్కించలేమని మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి ముందస్తు అంచనాలు జనవరి 7న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ గణాంకాలను వెల్లడించనుంది. అయితే సమగ్ర డేటాలో పలు రకాల మార్పలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని.. గణాంకాలను ఫిబ్రవరి 28 కేంద్రం విడుదల చేయనుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతకముందు ఈ గణాంకాలను జనవరి చివరి రోజున విడుదల చేసేది. .ఫిబ్రవరి 1న ప్రకటించనున్న బడ్జెట్‌లో కీలకమైన అధికారిక గణాంకాల విడుదలను షెడ్యూల్ చేయడం వల్లే డేటాలో గందరగోళం నెలకొందని కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే తేదీని వాయిదా వేశారని తెలుస్తోంది.

Also Read: Veera Simha Reddy Collection : కలెక్షన్లలో నిజమెంత ఉంది.. వీరయ్య, వీర వసూళ్ల పోస్టర్ల మీద చర్చలు

Also Read: Sunny Leone: సన్నీ లియోన్ పెదవికి గాయం!.. కావడానికి ఇదే కారణమా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News