Budget 2022: ఏప్రిల్​ 1 నుంచి ధరలు పెరిగేవి, తగ్గేవి ఏవో తెలుసా?

బడ్జెట్​ 2022-23ని పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఎప్పటిలానే ఈ సారి కూడా బడ్జెట్​ నిర్ణయాల వల్ల కొన్ని వస్తు, సేవల ధరలు పెరగటం, మరికొన్నింటి ధరలు తగ్గటం వంటివి జరగనున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 03:09 PM IST
  • బడ్జెట్ 2022లో కీలక ప్రకటనలు
  • దిగిరానున్న ఎలక్ట్రానిక్స్​ ధరలు
  • క్రిప్టో కరెన్సీ ఆదాయంపై పన్ను వాత!
Budget 2022: ఏప్రిల్​ 1 నుంచి ధరలు పెరిగేవి, తగ్గేవి ఏవో తెలుసా?

Budget 2022: బడ్జెట్​ 2022-23ని పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఎప్పటిలానే ఈ సారి కూడా బడ్జెట్​ నిర్ణయాల వల్ల కొన్ని వస్తు, సేవల ధరలు పెరగటం, మరికొన్నింటి ధరలు తగ్గటం వంటివి జరగనున్నాయి.

బడ్జెట్ 2022లో చేసిన ప్రకటనల ఆధారంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ధరలు పెరిగే, ధరలు తగ్గే వస్తు, సేవల వివరాలు ఇలా ఉన్నాయి.

ధరలు తగ్గేవి ఇవే..

పాలీష్​ చేయని డైమండ్స్​పై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో డైమండ్స్ ధరలు కాస్త దిగిరానున్నాయి.

దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ప్రకటించిన నిర్ఱమయాల వల్ల ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఛార్జల వంటి వాటి ధరలు దిగిరానున్నాయి.

స్టీల్​ ల్ తుక్కుపై మరో ఏడాది రాయితీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీనితో స్టీల్​ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశముందని అంచనాలు వస్తున్నాయి.

ఇక బట్టలు, పెట్రోలియం ఉత్పత్తులు, మిథనాల్ వంటి రసాయనాల ధరలు కూడా తగ్గే అవకాశముంది.

వీటి ధరలు మరింత ప్రియం..

దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచేందుకు దిగుమతి చేసునే వస్తువులపై సుంకాలు పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనితో దిగుమతి చేసుకునే వస్తువులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మరింత ప్రియం కానున్నాయి.

డిజిటల్ అసెట్స్​పైన భారీగా పన్ను విధించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీల ద్వారా లభించే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.

Also read: Budget 2022: త్వరలో ఈ-పాస్‌పోర్ట్‌లు..ఇకపై మీ డేటా సేఫ్..

Also read: Budget 2022: ఐటీ రిటర్న్‌ల దాఖలులో వెసులుబాటు.. రెండేళ్లలో అప్‌డేట్‌ చేసుకోవచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News