Budget 2022: బ్యాంకింగ్ వ్యవస్థలో చేరిపోనున్న పోస్టాఫీసులు

Budget 2022: కేంద్ర బడ్జెట్‌లో పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని పోస్టాఫీసులు బ్యాంకింగ్ వ్యవస్థలుగా మారిపోనున్నాయి. ఈ మేరకు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 2, 2022, 10:10 AM IST
Budget 2022: బ్యాంకింగ్ వ్యవస్థలో చేరిపోనున్న పోస్టాఫీసులు

Budget 2022: కేంద్ర బడ్జెట్‌లో పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని పోస్టాఫీసులు బ్యాంకింగ్ వ్యవస్థలుగా మారిపోనున్నాయి. ఈ మేరకు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. 

పార్లమెంట్‌లో ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనన చేశారు. క్రిప్టోకరెన్సీ ఆదాయంపై 30 శాతం ట్యాక్స్‌తో ఝలక్ ఇస్తూనే..డిజిటల్ రూపీ ప్రవేశపెడుతున్నట్టు చెప్పి ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చారు. మరోవైపు దేశంలో 5జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. దేశంలో రానున్న మూడేళ్లలో 4 వందల వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. 

ముఖ్యంగా పోస్టాఫీసులకు (Post Offices) సంబంధించి ముఖ్యమైన ప్రకటన జారీ అయింది. పోస్టాఫీసు ఖాతాదారులకు ఇది కచ్చితంగా శుభవార్తే. దేశంలోని పోస్టాఫీసులు ఇకపై బ్యాంకింగ్ వ్యవస్థలుగా మారనున్నాయి. దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసుల్ని కోర్ బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitaraman)వెల్లడించారు. ఫలితంగా ప్రజలు ఇక నుంచి పోస్టాఫీసు ఎక్కౌంట్ల నుంచే డబ్బును ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా పోస్టాఫీసు ఎక్కౌంట్ల నుంచి ఇతర బ్యాంకులకు డబ్బు బదిలీ చేసుకునే అవకాశం తొలిసారిగా కలగనుంది. ఈ ఏడాదిలో దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసులు నూటికి నూరుశాతం కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చేస్తాయన్నారు. అదే జరిగితే..పోస్టాఫీసు ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు చేసుకునే వీలుంటుంది. ఇతర బ్యాంకు ఖాతాలకు నగదు కూడా బదిలీ చేసుకోవచ్చు. 

మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో(Budget 2022) ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్..విద్యారంగంపై వరాలు కురిపించారు. త్వరలో డిజిటల్ యూనివర్శిటీ ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ విద్య కార్యక్రమంలో భాగంగా టీవీ ఛానెళ్లను 12 నుంచి 2 వందలకు పెంచనున్నామన్నారు. 

Also read: Digital Rupee: క్రిప్టోకరెన్సీకు, డిజిటల్ రూపీకు వ్యత్యాసమిదే, ఇవే ఆ ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News