BRS MLC Kalvakuntla Kavitha about Singareni: హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సింగరేణి సంస్థకి ప్రక్షపాతి అని, అందుకే సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Revanth Reddy About 6 Guarantees in Telangana: రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
MLC Patnam Mahender Reddy takes oath as minister: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈటల రాజేందర్ ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి పార్టీలోంచి బయటకి పంపించేసిన తరువాత అప్పటి వరకు ఈటల రాజేందర్ నిర్వర్తించిన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను మంత్రి హరీశ్ రావుకి అప్పగించిన విషయం తెలిసిందే.
Muthireddy Yadagiri Reddy vs Palla Rajeshwar Reddy: జనగాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు మొదలైందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. జనగాం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి vs పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నట్టుగా జరుగుతున్న వివాదంలో తాజాగా మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
Ramreddy Damodar Reddy Party Changing News: సూర్యాపేట నుంచి తాను పోటీచేసే విషయంలో లోకల్ - నాన్ లోకల్ అని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అంటూ ఆ విషయాన్ని ప్రస్తావించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. 40 సంవత్సరాలుగా సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నాను అనే విషయాన్ని పార్టీ మిత్రులు గమనించాలి అని అన్నారు.
Double Bedroom Flats Distribution: ఎన్నికలు వచ్చిన ప్రతీసారి తియ్యటి మాటలతో ప్రజలను మభ్య పెడుతూ ప్రజలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ఓట్ల కోసం మాత్రమే కేసిఆర్ కొత్త కొత్త పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుందని.. ఆ తరువాత ఇచ్చిన హామీలను, ప్రవేశపెట్టిన పథకాలను మర్చిపోవడం జరుగుతోంది అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Brs Party: జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒంటరి అవుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. తనతో కలిసివచ్చే పార్టీలతో కలిపి... ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పాలని ప్లాన్ చేశారు బీఆర్ఎస్ అధినేత.
BJP MLAs Raghunandan Rao, Raja Singh to join BRS ?: బీజేపీలో ట్రిపుల్ R గా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఎమ్మెల్యేస్ లో వీరు ఇద్దరు పార్టీలో తమ గళాన్ని గట్టిగ వినిపించి ఇప్పుడు ఒక్కసారిగా మౌనం పాటిస్తున్నారు. రఘునందన్ రావు ఒక పదవిపై కన్నువేయడం, రాజసింగ్ నోటి మాటల వలెనే బీజేపీ అధిష్టానం వీరిని పక్కన పెట్టినట్టు సమాచారం. దీనికి వారిలో అసంతృప్తి కారణమా ? సరైన గుర్తింపు లేకపోవడమా ?
KTR About Revanth Reddy's Comments on Electricity Supply For Farmers: కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రైతులను ఉద్దేశించి హెచ్చరించారు. మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అని వ్యాఖ్యానించడమంటే.. ముమ్మాటికీ అది సన్నకారు రైతులను, చిన్నకారు రైతులను అవమానించడమే అవుతుంది అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Revanth Reddy Counter to KTR: తెలంగాణలో రైతాంగానికి కేవలం 3 గంటల విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా జరుగుతున్న రాజకీయం తెలంగాణలో రాజకీయాన్ని ఎంత వేడెక్కించిందో తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ సర్కారుతో పాటు మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
CM KCR meeting with leaders from Solapur in Maharashtra: హైదరాబాద్ : మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత వున్నదని, ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
35 BRS Leaders To Join Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయా ? బీఆర్ఎస్ పార్టీ నుంచి పదుల సంఖ్యలో నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? మరీ ముఖ్యంగా ఒక్క కాంగ్రెస్ పార్టీలోకే 35 మంది బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.
BRS Party: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నాగ్‌పూర్‌లో ఈ రోజు ప్రారంభించారు. పార్టీ ఆఫస్ ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
Minister Harish Rao Speech in Achhampeta BRS meeting: తెలంగాణ గొప్పతనం నిలిపే విధంగా కేసిఆర్ సెక్రటేరియట్ కడితే.. బిజెపి నాయకుడు కూలగొడతా అన్నాడు. కాంగ్రెస్ వారు పేల్చేస్తాం అన్నాడు. కూల్చేటోడో లేక పేల్చేటోడో కావాలా.. లేదంటే తెలంగాణ నిర్మించేటోడు కావాలా అనేది జనమే నిర్ణయించుకోవాలి అని మంత్రి హరీష్ రావు సూచించారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే... ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు. పొరపాటున కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని హెచ్చరించారు. కొలువులు కావాలంటే కమలం రావాలంటూ నినదించారు. ఖమ్మం నిరుద్యోగ ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బండి సంజయ్ చురకలు అంటించారు.
Arvind Kejriwal Meets KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా పర్యటించి పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్న అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.
Bandi Sanjay Kumar Satires on KCR Govt: " దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్లు తీసుకుంటే... మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి వెళుతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళుతున్నాయి.
BRS Party : బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు ముఖ్య నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. ముంబై మహా నగర మాజీ మేయర్ కూడా బీఆర్ఎస్లో చేరారు.
Palair MLA Kandala Upender Reddy MLA Ticket: రాజకీయాల పరంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పరిస్థితేం బాగోలేదు. రాబోయే ఎన్నికల్లో తనకు పాలేరు నుంచి బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందా లేదా అనే టెన్షన్ కందాలను వేధిస్తోంది. అందుకు కారణాలు ఏంటనేది ఈ విశ్లేషణాత్మక కథనం చూస్తే పాలేరులో నడుస్తోన్న ట్రయాంగిల్ ఫైట్ ఏంటో మీకే అర్థం అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.