BJP MLAs Raghunandan Rao, Raja Singh: రఘునందన్ రావు, రాజా సింగ్‌లు పార్టీ మారుతున్నారా ?

BJP MLAs Raghunandan Rao, Raja Singh to join BRS ?: బీజేపీలో ట్రిపుల్ R గా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఎమ్మెల్యేస్ లో వీరు ఇద్దరు పార్టీలో తమ గళాన్ని గట్టిగ వినిపించి ఇప్పుడు ఒక్కసారిగా మౌనం పాటిస్తున్నారు. రఘునందన్ రావు ఒక పదవిపై కన్నువేయడం, రాజసింగ్ నోటి మాటల వలెనే బీజేపీ అధిష్టానం వీరిని పక్కన పెట్టినట్టు సమాచారం. దీనికి వారిలో అసంతృప్తి కారణమా ? సరైన గుర్తింపు లేకపోవడమా ? 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2023, 09:14 AM IST
BJP MLAs Raghunandan Rao, Raja Singh: రఘునందన్ రావు, రాజా సింగ్‌లు పార్టీ మారుతున్నారా ?

BJP MLAs Raghunandan Rao, Raja Singh to join BRS ?: బీజేపీలో ట్రిపుల్ R గా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఎమ్మెల్యేస్ లో వీరు ఇద్దరు పార్టీలో తమ గళాన్ని గట్టిగ వినిపించి ఇప్పుడు ఒక్కసారిగా మౌనం పాటిస్తున్నారు. రఘునందన్ రావు ఒక పదవిపై కన్నువేయడం, రాజసింగ్ నోటి మాటల వలెనే బీజేపీ అధిష్టానం వీరిని పక్కన పెట్టినట్టు సమాచారం. దీనికి వారిలో అసంతృప్తి కారణమా ? సరైన గుర్తింపు లేకపోవడమా ? పదవులే వీరి ఎదుగుదలకు ఆటంకం గలిగించాయా అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు వీరి నుండి రాబట్టడం కష్టమే... దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, గోషామాహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ల దారెటు? దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లను బీజేపీ అధిష్టానం అసలు ఎందుకు పక్కన పెట్టింది? ఇవే ఆ కారణాలు అనుకోవచ్చా ? 

మొన్న మీడియా సమావేశం, నిన్న మీడియా మిత్రులతో చిట్ చాట్ రూపంలో బయటికిచ్చిన ఆడియో రికార్డు ఎమ్మెల్యే రఘునందన్ మౌనానికి కారణమా అంటే ఒకింత అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వకీల్ గా ప్రూఫ్ తో ఎవరినైనా కడిగిపారేసే దమ్మున్న ఎమ్మెల్యే రఘునందన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడానికి ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీనే వీరిని పక్కన పెట్టడంతో బీజేపీ పైనే విమర్శలు విసురుతున్నారనే ప్రచారం కూడా జోరుగా వినబడుతోంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే రఘునందన్ ఒక పదవిపై కన్నేసి అది దక్కకపోవడం వల్లనే అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఇంతకీ ఆ పదవి ఏంటి ?

శాసన సభా పక్ష నేత పదవి కోసం ఎమ్మెల్యే రఘునందన్ పోరాడుతున్నారు. అటు ఈటల రాజేందర్ కు జాయినింగ్ కమిటీ చైర్మన్ పదవి, ఇటు రాజాసింగ్ పై ఉన్న పార్టీ సస్పెన్షన్ తో ఆ పదవి రఘునందన్ కె వస్తుందని ఉహించుకున్న రఘునందన్.. పార్టీ ఆ పదవి తనకు ఇవ్వడం ఇష్టంలేకనే ఆ పదవిని అధిష్టానం ఖాళీగా ఉంచిందనే కారణంతో రఘునందన్ ఈ అలకలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ గతంలో శాసన సభ పక్ష నేతలుగా ఉన్న వివిధ పార్టీల నేతలు ఆ పదవిని ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కారణాలు ఏమైనా బీజేపీ ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచింది. తాజాగా  రఘునందన్ ఆడియో లీక్ కావడం సంచలనాన్ని రేపింది. ఇప్పటివరకు పార్టీలో తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా నీటిలో పోసిన పన్నీరు అయినట్టే కావడంతో రఘునందన్ కొంత మౌనం పాటిస్తున్నారు. ఆడియో అధిష్టానం వరకు వెళ్లినా ఎలాంటి యాక్షన్ తీస్కోకపోవడంతో అంతర్గతంగా కోల్డ్ వార్ నడుస్తునట్టు సమాచారం. బీజేపి పార్టీ రఘునందన్ ని పక్కన పెట్టేసినట్టే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ కి సీట్ రావడం కూడా కష్టమే అంటున్నాయి పార్టీ వర్గాలు.

పార్టీలో ఎంతో కష్టపడి పోరాడే నేత రఘునందన్ మునుగోడు ఎన్నికల సమయంలో డబ్బు ఖర్చుపెట్టినట్టు బండి సంజయ్ పై ఆరోపణలు, శాసన సభ పక్ష నేత లేడని జేపీ నడ్డాకి తెలీదా ? బీజేపీని చూసి కాదు రఘునందన్ ని చూసి ఓట్లు వేశారు అన్న ఈ ఆడియోలో ఉన్న మాటలతో రఘునందన్ ని అధిష్టానం పక్కనపెట్టినట్టే అని సమాచారం. కేంద్రం నుండి నిధులు తెస్తానని ప్రజల ఓట్లతో గెలిచిన రఘునందన్ ఆ నియోజకవర్గానికి ఎం చేశారని ఇప్పటికే అక్కడి ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక రాజా సింగ్ విషయానికి వస్తే ఒక వర్గంపై ఘాటుగా కామెంట్స్ చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఆ విషయంలో ఇప్పటికే బీజేపీ తీవ్ర విమర్శలు, వ్యతిరేకత ఎదురుకుంటోంది. దీంతో అధిష్టానం రాజాసింగ్ ను పక్కన పెట్టినట్టేనని.. సీట్ కూడా లేనట్టే అంటూ రాజకీయ విశ్లేషకుల అంచనా. కర్ణాటక ఎన్నికల సమయంలో బీజేపీ నేత ఈశ్వరప్ప ఇంచు మించు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ అతనిపై పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. నూపూర్ శర్మ జాడే లేదు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఓట్లు చీలేలా, ఏదైనా వర్గంపై ఘాటు వ్యాఖ్యలు చేసినా, పార్టీ పేరు, ప్రతిష్టలకు వ్యతిరేకంగా వెళ్లినా బిజెపి అధిష్టానం వారందరినీ సైలెంటుగా పక్కన పెడుతూ వస్తోంది. ఇక రాజా సింగ్ ను సైతం పక్కన పెట్టినట్టే అంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలోనే తాజాగా రాజా సింగ్ వెళ్లి హరీష్ రావుతో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఇదే విషయమై రాజా సింగ్ స్పందిస్తూ.. తాను బతికున్నంత కాలం బిజెపిలోనే ఉంటానంటూ.. కేవలం తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే మంత్రి హరీష్ రావును కలిశాను అంటూ సర్ది చెప్పుకొచ్చినప్పటికి... ఒక పక్క పార్టీ సస్పెన్షన్ మరోపక్క హరీష్ రావుతో భేటీతో రాజకీయ వర్గాల్లో రాజాసింగ్ బిఆర్ఎస్ పార్టీకి వెళ్లబోతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటు రఘునందన్, అటు రాజా సింగ్.. వీరు ఇరువురు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టు, బిఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం రఘునందన్ రావుకు మద్దతుగా నిలిచిందని.. అందుకే రఘునందన్ రావు సొంత పార్టీపై విమర్శలు గుపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత్తతత్వ కోణంలో ఉత్తరాధి రాష్ట్రాలలో ప్రోత్సహించినప్పటికీ.. మితిమీరితే దక్షాణాది రాష్ట్రాల్లో నష్టం అనే అంశం కర్ణాటక ఎన్నికలతో రుజువుయిందని బీజేపి అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలా వ్యాఖ్యలు చేసే వారిపై కన్నెర్ర చేస్తోన్న బీజేపీ అధిష్టానం.. బండి సంజాయ్ పై సైతం ఇలాంటి పిర్యాదులు వెళ్లినందువల్లే ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టినట్టు సమాచారం.

ఇది కూడా చదవండి : Harish Rao Comments: అందుకే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించారు: మంత్రి హరీష్‌ రావు

పార్టీ రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడానికి బండి సంజయ్ కృషి చేస్తారన్న రాజా సింగ్, బండి సంజయ్ తొలగింపుతో ఆ ఆశలు కోల్పోయి పార్టీ మారే యోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలంగాణ బిజెపిలో బీజేపీ అధిష్టానం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు అంచనాలకు సైతం అందడం లేదు. ఎన్నికల సమయం వరకు ఎదురు చూస్తే గాని అసలు ప్లాన్ ఏంటో తెలిసేలాలేదనే టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి : YS Sharmila to KCR: సంక్షేమ పథకాలు అన్నీ బీఆర్ఎస్ దొంగలకేనా ? : వైఎస్ షర్మిల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News