Revanth Reddy Counter to KTR: 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై రేవంత్ రెడ్డి ప్రకటన

Revanth Reddy Counter to KTR: తెలంగాణలో రైతాంగానికి కేవలం 3 గంటల విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా జరుగుతున్న రాజకీయం తెలంగాణలో రాజకీయాన్ని ఎంత వేడెక్కించిందో తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ సర్కారుతో పాటు మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. 

Last Updated : Jul 14, 2023, 03:48 AM IST
Revanth Reddy Counter to KTR: 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై రేవంత్ రెడ్డి ప్రకటన

Revanth Reddy Counter to KTR: గత రెండు రోజులుగా పుట్టలో పడుకున్న పాములు బయటకు వచ్చి నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నాయన్న రేవంత్ రెడ్డి.. " 24 గంటల విద్యుత్ సరఫరా విషయంపై సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేసాం. కానీ కేటీఆర్, బీఆరెస్ పార్టీలు మా వీడియోను ఎడిట్ చేసి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఏదేమైనా బీఆరెస్ చిల్లర ప్రయత్నంతో రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌పై చర్చకు అవకాశం వచ్చింది " అని అన్నారు.

అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి వివరించానని తన అమెరికా టూర్ గురించి రెండు ముక్కల్లో చెప్పిన రేవంత్ రెడ్డి.. తాను ఇక్కడ లేని సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తనపై చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి నెరవేర్చారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటన జరిగిన సందర్భంలో కేసీఆర్ హెచ్ఆర్డీ విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదని ఆనాడు కేసీఆర్ చెప్పారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటన సందర్భంలో కేసీఆర్ కీలక స్థానంలో ఉండి కూడా ఉచిత విద్యుత్ సాద్యపడదు అని ప్రకటించారు అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
 
ఉచిత విద్యుత్ హామీపై తొలి సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీనేనని.. ఉచిత విద్యుత్ మాత్రమే కాదు.. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని కాంగ్రెస్ అనేక పథకాలు తీసుకొచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థల పంపిణీ విషయంలో జైపాల్ రెడ్డి ఎంతో చొరవ చూపారు. జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన విద్యుత్ పంపకాలు జరపాలని ఆయన సోనియాను ఒప్పించారు. అలా తెలంగాణకు 53 శాతం.. ఏపీకి 47 శాతం విద్యుత్ ఇచ్చేలా ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న  కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అన్నారు.

వ్యవసాయం అంటే ఏమిటో తనకు తెలుసు.... నాగలి పట్టడం, గుంటుక కొట్టడం తెలిసిన వాడిని.. కేటీఆర్‌లా తాను అమెరికాలో బాత్రూంలు కడగలేదు. వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న రైతు బిడ్డను నేను. తాను పాస్‌పోర్ట్ బ్రోకర్ కొడుకును కాదు.. వాస్తవంగా కేసీఆర్ 24 గంటలవిద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అప్పట్లో కేసీఆర్ గొప్పగా చెప్పారు. రూ 2.60 పైసలకే విద్యుత్ ప్లాంట్లు ఇస్తామని... ప్లాంట్ల ఏర్పాటు విరమించుకోవాలని గతంలో కేంద్రం చెప్పిందన్నారు. 

కేసీఆర్ పాలనలో ఏ ప్లస్ గ్రేడ్ ఉన్న డిస్కంలు సీ మైనస్ కు పడిపోయాయి. కాంగ్రెస్ హయాంలో మొదటి పది స్థానాల్లో ఉన్న డిస్కంలు... కేసీఆర్ హయాంలో చివరి పది స్థానాల్లోకి పడిపోయాయి. 2వేల కోట్ల యూనిట్లు ఉచితంగా ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. ఏడాదికి 16వేల కోట్లు 24 గంటల విద్యుత్‌కు ఖర్చు చేస్తున్నామన్నారు. ఉచితాన్ని అనుంచితంగా కేసీఆర్ అవినీతికి వాడుకుంటున్నారు. 24గంటల విద్యుత్ ముసుగులో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది. 24 గంటల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి శశభిషలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరతాం అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x