Bandi Sanjay on munugode Bypolls: టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా రాచకొండ కమిషనర్, ఎస్పీ, ఎన్నికల ప్రధానాధికారి వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై శివన్నగూడెంలో టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి మద్యం మత్తులో దాడికి ప్రయత్నించారని అన్నారు.
Bandi Sanjay Arrest: మునుగోడు పోలింగ్ వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి మునుగోడుకు వెళుతున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Arrest: హైదరాబాద్ నుంచి మునుగోడుకు వెళ్తున్న బండి సంజయ్‌ను అబ్ధుల్లాపూర్‌మెట్ వద్ద అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చక్కర్లు కొడుతున్న ఓ లేఖ బీజేపీలో కలకలం రేపుతోంది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ముందే గ్రహించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఓటమి తనదే బాధ్యత అని ఒప్పుకున్నారట.
Fake Letter Viral On Bandi Sanjay: మునుగోడు పోలింగ్‌కు సమయం దగ్గపడుతున్న వేళ ఓ లేఖ బీజేపీలో కలకలం రేపింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు మీద లెటర్ వైరల్ అయింది. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Letter Viral: మునుగోడు పోలింగ్‌కు సమయం దగ్గపడుతున్న వేళ ఓ లేఖ బీజేపీలో కలకలం రేపింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు మీద లెటర్ వైరల్ అయింది.
Telangan BJP President Bandi Sanjay lashed out CM KCR comments at Chandur Meeting. చండూరులో టీఆర్ఎస్ నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ చేసిన విమర్శలను సంజయ్ తిప్పికొట్టారు.
Bandi Sanjay Allegations on KTR, KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై తెలంగాణ బీజేపి అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు సైతం చేశారు.
BANDI SANJAY: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో సంబంధంలేదని బండి సంజయ్.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని కోరారు. 100 కోట్లు డబ్బు అన్నారు..డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను బయటకు ఎందుకు రానివ్వడం లేదని అన్నారు. ఆధారాలు లేవు కాబట్టి కోర్టు రిమాండ్‌కు కూడా ఇవ్వలేదని తెలిపారు. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీ ప్రతిష్ట దిగదార్చే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు తలదించుకునేలా సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని అన్నారు.
KTR COMMENTS:ముగ్గురు నిందితుల రిమాండ్ ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించిన హైకోర్టు.. నిందితులను లొంగిపోవాలన ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ పై మరో తీర్పు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు పోలీసుల దర్యాప్తుపై స్టే విధించింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కుట్రతో సంబంధం లేకుంటే యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఈ నేపథ్యలోనే బండి సంజయ్ యాదాద్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది.
CM KCR PRESS MEET: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన పోస్టు పెట్టారు. పెద్ద సార్ ప్రెస్‌మీట్ అంటూ ఫేస్ బుక్‌లో రేగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది.
Bandi Sanjay: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో గంటకో ట్విస్ట్ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్ట పర్యటన హై టెన్షన్ రేపుతోంది.
Munugode By Poll: Telangana BJP Chief Bandi Sanjay slams CM KCR. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అధికార పార్టీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ అని అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి స్పీచ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Counter To TRS: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. ఓ వైపు మునుగోడు ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభా పెట్టేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Bandi Sanjay Munugode Bypoll Campaign: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక ఝూటా మాటల కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని చెబుతూ ఆయన పలు పోస్టర్లు విడుదల చేశారు.
Bandi Sanjay Diwali: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో పండుగ మరింత ఉత్సాహంగా సాగింది. ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న నేతలు.. అక్కడే దీపావళి జరుపుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.