Railway New Timetable: జనవరి 1 నుంచి కొత్త రైల్వే టైమ్ టేబుల్, ఇలా www.irctc.co.in చెక్ చేసుకోండి

Railway New Timetable: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. రైలు సమయాల్లో మార్పు వస్తోంది. జనవరి 1 అంటే రేపట్నించి దేశవ్యాప్తంగా రైల్వే టైమ్‌టేబుల్ మారనుంది. ప్రయాణీకులు కొత్త టైమ్‌టేబుల్ చెక్ చేసుకోవాలని ఇండియన్ రైల్వేస్ విజ్ఞప్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 31, 2024, 07:29 PM IST
Railway New Timetable: జనవరి 1 నుంచి కొత్త రైల్వే టైమ్ టేబుల్, ఇలా www.irctc.co.in చెక్ చేసుకోండి

Railway New Timetable: కొత్త సంవత్సరం నుంచి దేశంలో రైలు వేళలు మారనున్నాయి. ఇండియన్ రైల్వేస్ రైళ్ల రాకపోకల్లో మార్పులు చేర్పులు చేసింది. కొత్త రైల్వే టైమ్‌టేబుల్ విడుదల చేసింది. జనవరి 1,2025 నుంచి అమల్లోకి రానుంది. రైల్వే ప్రయాణాలు చేసేవారు కొత్త టైమ్‌టేబుల్ చెక్ చేసుకోవాలని ఇండియన్ రైల్వేస్ సూచించింది. 

భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు లేదా ఏడాదికోసారి రైల్వే వేళల్లో మార్పులు చేస్తుంటుంది. కొత్త ఏడాది ప్రారంభం కానున్న తరుణంలో మరోసారి రైళ్ల సమయాలు మార్చింది. జనవరి 1 అంటే రేపట్నించి కొత్త వేళలు అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రూట్లలో కొత్త రైళ్లు ప్రారంభమైన నేపధ్యంలో రైల్వే సమయాల్లో మార్పులు అనివార్యమౌతుంటాయి. కొత్త రైల్వే టైమ్‌టేబుల్, మారిన రైలు సమయాల సమాచారం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ www.irctc.co.in లేదా నేషనల్ ఎంక్వైరీ సిస్టమ్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. అన్ని రైల్వే స్టేషన్లలో కూడా సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్నవాళ్లు టైమ్‌టేబుల్ చెక్ చేసుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త రైల్వే టైమ్ టేబుల్‌లో దాదాపు చాలా రైళ్ల సమయాల్లో మార్పు చోటుచేసుకుంది. 

రైల్వే ఆధునీకరణలో భాగంగా ఇండియన్ రైల్వేస్ కొత్తగా కొన్ని రైళ్లు ప్రవేశపెట్టనుంది. నమో భారత్ రేపిడ్ రైల్ లేదా వందే మెట్రో, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, వందేభారత్ స్లీపర్ రైళ్లతో పాటు కొత్త మార్గాల్లో వందేభారత్ రైళ్లు కొత్త ఏడాదిలో పరుగులు తీయనున్నాయి. ప్రయాణీకుల సౌకర్యం, వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక మార్పులు చేస్తోంది. దాంతో రైల్వే టైమ్‌టేబుల్ కూడా మారుతోంది. 

Also read: Leopard Alert: చిరుత తిరుగుతోంది నో ఆఫీస్, ఇంట్లోంచే పనిచేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News