YS Sharmila Padayatra: వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కీలక మైలురాయి దాటింది. 3000 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. తన పాద యాత్ర 3 వేల కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా హజీపూర్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల YSR పైలాన్ ఆవిష్కరించారు.
CM KCR Press meet: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపి కొనుగోలు చేయడానికి యత్నించిందని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న సీఎం కేసీఆర్.. తాజాగా అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెడుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KA Paul on munugode Bypolls: మునుగోడు ఉప ఎన్నిక పూర్తయిన అనంతరం ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ. పాల్ ఒక వీడియోను విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 50 వేల మెజారిటీతో గెలవబోతోందని.. మునుగోడు ఓటర్లు తమ పార్టీకే పట్టం కట్టబోతున్నారని ఈ వీడియోలో అభిప్రాయపడిన కేఏ పాల్.. ఓటర్లను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.
KCR Allegations on BJP: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తో పాటు బీజేపీ అగ్ర నేతలపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు.
Bandi Sanjay on munugode Bypolls: టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా రాచకొండ కమిషనర్, ఎస్పీ, ఎన్నికల ప్రధానాధికారి వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై శివన్నగూడెంలో టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి మద్యం మత్తులో దాడికి ప్రయత్నించారని అన్నారు.
Munugode Bypolls Exit Polls : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు వెల్లడి అయ్యాయి. మునుగోడు ఎన్నికల ఫలితాల కంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ vs బీజేపి vs కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కొనసాగిన ఈ త్రికోణ పోరులో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఓటరు దేవుళ్లు ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
KCR Press Meet: తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు బీజేపి కుట్ర పన్నిందని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజాగా మరో బాంబు పేల్చారు.
KCR Press meet: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తాజాగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం కేసీఆర్ వేదాంత ధోరణిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Speech: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మంత్రి కేటీఆర్ ప్రయోగించిన దత్తత పాచికనే చివరి అస్త్రంగా ప్రయోగిస్తున్నారా ? ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రచారం ముగిసే దశలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Komatireddy Rajagopal Reddy Gets EC Notice: మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తోన్న బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్ ఇచ్చింది. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను ప్రలోభపెట్టడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 5 కోట్లకుపైగా మొత్తాన్ని సొంత కంపెనీ ఖాతా నుంచి నిధులు మళ్లించారని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై ఈసి స్పందించింది.
Bandi Sanjay Allegations on KTR, KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై తెలంగాణ బీజేపి అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు సైతం చేశారు.
TRS complaint Against BJP: మునుగోడ ఉప ఎన్నిక సమరంలో నువ్వా, నేనా అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ, బీజేపిలు ఎన్నికల ప్రచారంలో బాహాబాహీకి దిగుతున్నాయి. ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు వివిధ పార్టీల నేతలు సైతం వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీఆర్ఎస్ నేతలు జిల్లా ఎన్నికల అధికారిని కలిశారు.
EC Action on Jagadish Reddy: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసి ఈ విషయంలో మంత్రి జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీచేసింది.
MLA Crying Video Goes Viral : ఒక ఉప ఎన్నికలో గెలుపు కోసం కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తున్న ప్రజాప్రతినిధులను చూస్తున్న గడ్డ మనది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మందు, విందు, చిందులకే కోట్ల రూపాయలు తగలేస్తున్న కార్పొరేట్ నేతలున్న నేల మనది. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఒక ఎమ్మెల్యే గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవడం ఖాయం.
Rahul Gandhi in TS: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో మూడు రోజుల బ్రేక్ అనంతరం ఇవాళ ఉదయం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇదే ఉత్సాహంతో కాశ్మీర్ చివరి వరకు కొనసాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
Bandi Sanjay Munugode Bypoll Campaign: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక ఝూటా మాటల కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని చెబుతూ ఆయన పలు పోస్టర్లు విడుదల చేశారు.
Revanth Reddy's Munugode Bypoll Campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో మెజార్టీ ఓటు బ్యాంకు కలిగి ఉన్న గిరిజనులను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులకు విద్య అవకాశాలు, చట్టసభల్లో అధిక ప్రాతినిథ్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు.
Munugode bypolls campaigns: మునుగోడులో ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య ప్రతీకార జ్వాలలు రాజుకుంటున్నాయి. అభ్యర్థుల అనుచరులు ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు.
Liquor Bottles To Munugode Bypoll Voters: మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతున్న తీరు చూస్తోన్న నెటిజెన్స్.. పనికి ఆహార పథకం తరహాలో ప్రస్తుతం ఓటుకు మద్యం పథకం నడుస్తోందంటున్నారు. మునుగోడులో స్థానికంగా ఉండని వారి కోసం కూడా హైదరాబాద్ లోనే ఫంక్షన్ హాళ్లలో మీటింగులు పెట్టి అక్కడే అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాల తరహాలో వారికి అందాల్సిన మద్యం బాటిళ్లు వారికే పంపిణి చేస్తున్నారు.
Rapolu Ananda Bhaskar To Join TRS: బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణం అయిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.