KCR Polam Bata: కరువు పరిస్థితులు ఎదురవడంతో సంక్షోభం ఎదుర్కొంటున్న రైతులను కేసీఆర్ పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. నీళ్లు లేక పంటలు ఎండి దుర్భిక్షంలో ఉన్న రైతులను సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించి పరామర్శించారు. కేసీఆర్కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
KCR Craze: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై గులాబీ బాస్ కేసీఆర్ కదిలారు. నీళ్లు లేక పంటలు ఎండి దుర్భిక్షంలో ఉన్న రైతులను కేసీఆర్ పరామర్శించారు. జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాల పర్యటనలో కేసీఆర్ అపూర్వ స్వాగతం దక్కింది. కేసీఆర్కు ఏమాత్రం క్రేజీ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది.
KCR Sensational Comments On Revanth Reddy: తాము అధికారం కోల్పోయిన మూడు నెలలకే తెలంగాణ ఎండిపోతుందని.. దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.
Etela Rajender Press Meet Today: దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని, తెలంగాణలో సంపదకు కొదువలేదని, అన్నింట్లో నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు. ఆఖరికి పరిస్థితి ఎలా తయారైందంటే.. భూములను అమ్మితే కానీ రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారింది అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Koppula Eeshwer: ప్రగతి భవన్ లో జరిగిన ఓ ఘటనతో కేసీఆర్ దళిత నేతను అవమానించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే బేరసారాలకు సంబంధించిప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్. ఈ సందర్భంగానే సీనియర్ నేత, దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఘోర అవమానం జరిగింది.
Bandi Sanjay on munugode Bypolls: టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా రాచకొండ కమిషనర్, ఎస్పీ, ఎన్నికల ప్రధానాధికారి వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై శివన్నగూడెంలో టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి మద్యం మత్తులో దాడికి ప్రయత్నించారని అన్నారు.
KCR Press meet: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తాజాగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం కేసీఆర్ వేదాంత ధోరణిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
CM KCR PRESS MEET: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన పోస్టు పెట్టారు. పెద్ద సార్ ప్రెస్మీట్ అంటూ ఫేస్ బుక్లో రేగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది.
Etela Rajender: తెలంగాణలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న బీజేపీలో చేరనున్నారు. చేరికలకు సంబంధించి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని చెప్పారు ఈటల రాజేందర్.
Kcr vs Bandi Sanjay: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్.. తన జాతీయ పార్టీపై క్లారిటీ ఇస్తూనే బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కేసీఆర్ చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Etela Rajender on CM KCR: రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో (Maharashtra-Telangana border) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పోలీసులు అనుమానంతో ఆ రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడుతూ.. తాము సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో నిరసన తెలిపామని, త్వరలో భావసారూప్యత గల ముఖ్యమంత్రులతో సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
భారత ప్రధాని మోడీని అమర్యాదగా సంబోధించారనే ఆరోపణలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడు మోడీని గాడు అని సంబోధించలేదని..ఇది కేవలం వక్రీకరణ మాత్రమేనన్నారు. మోడీకి గారు అని సంబోధిస్తే. దాన్ని మోడీ గాడు అన్నట్లు క్రీయేట్ చేశారని ఆరోపించారు. తనకు మోడీతో ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని..అయితే తన ద్వేషమంతా ఈ వ్యవస్థపైనేనని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా మోడీ విషయంలో తాను ఎప్పుడు తప్పు మాట్లాడలేదని..తన మాటలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.