Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాళ్ల దాడి జరిగింది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ప్రస్తుతం జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు బండి సంజయ్. దేవరుప్పల సభలో సంజయ్ ప్రసంగిస్తుండగా.. అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Telangana BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం జరిగింది.తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.
Rajagopal Reddy: మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో భేటీ కానున్నారు.
Rajagopal Reddy Meets Bandi Sanjay: తెలంగాణ రాజకీయాలన్నీ మునుగోడు చూట్టే తిరుగుతోంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Dasoju Sravan: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ కమలం పార్టీలో చేరారు.తెలంగాణ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు దాసోజు శ్రవణ్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బిజెపి ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్ రావు హాజరయ్యారు.
Etela Rajender: తెలంగాణలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న బీజేపీలో చేరనున్నారు. చేరికలకు సంబంధించి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని చెప్పారు ఈటల రాజేందర్.
Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 21న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. మునుగోడు నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించనున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన కోమటిరెడ్డి ఆ విషయాలను తెలిపారు.
Dasoju Sravan: ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని పబ్లికి లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరడం ఖాయమైంది.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ ఏర్పాటుతో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. కేసీఆర్ ను వదిలేది లేదని స్పష్టం చేశారు.
MUNUGODE BYELECTION: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో మునుగోడుకు త్వరలో ఉపఎన్నిక రాబోతోంది.మునుగోడు గడ్డ మొదటి నుంచి పోరాటాలకు కేంద్రంగా నిలిచింది. మొదటి నుంచి కమ్యూనిస్టుల కోట. వామపక్ష ఉద్యమాలకు ఊపిరిపోసింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి నేతలు కీలకంగా వ్యవహించారు.
Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.కేంద్ర మంత్రులను ఆలయ ఈవో పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు
Telangana BJP President Bandi Sanjay third Praja Sangrama Yatra starts from today. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మూడవ విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ఈరోజు నుంచి ప్రారంభం కానుంది.
Munugodu ByElection: తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులుగా ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని.. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందనే చర్చ జరుగుతోంది.
Bandi Sanjay Yatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి సాగనుంది. ఈసారి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం నుంచి వరంగల్ భద్రకాళి వరకు ఆలయం వరకు యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు బండి సంజయ్.
BJP Joinings: తెలంగాణలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకునేలా అధికార, విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. చేరికల కోసమే బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి.
BJP: దేశంలో కమలనాథులు స్పీడ్ పెంచారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు. పాట్నాలో జరిగిన పార్టీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి కనిపిస్తోంది. జోరుగా నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార ,విపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటూనే.. ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.