Telangana BJP Chief Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు నుంచి అనుమతి వచ్చింది. అయితే కొన్ని కండిషన్లు పెట్టింది. భైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర చేపట్టాలని సూచించింది.
Bandi Sanjay Padayatra: నిర్మల్ జిల్లా ఎస్పీని కలవడానికి వెళుతున్న వాళ్లను కూడా పోలీసులు అడ్డుకుని దారుణంగా కొడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపి కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Bandi Sanjay Padayatra in Bhainsa: శాంతియుత పద్ధతిలో పాదయాత్రకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏంటని ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ రాకకు ఏర్పాట్లు చేసి యూ టర్న్ తీసుకుంటారా అని పోలీసులను ప్రశ్నించారు.
Marri Shashidhar Reddy joining BJP: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి బీజేపిలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం అందుతోంది.
SIT Investigation : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ సన్నిహితులు శ్రీనివాస్‌ను సిట్ సుధీర్ఘంగా విచారించింది. స్వామిజీలకు టికెట్లు వేసి ఎందుకు పిలిపించారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
Car Racing in Hyderabad: కార్ల రేసింగ్ ట్రయల్స్ కోసం సెక్రటేరియట్ పరిసరాల్లో నడిరోడ్డుపై మద్యాన్ని ఏరులై పారిస్తారా ? కార్ల రేసింగ్ కోసం ఎన్టీఆర్ పార్కును అడ్డంగా చీలుస్తారా ? ఇంతకీ ఈ రేసింగ్ నిర్వహణ ప్రభుత్వానిదా ? లేక ప్రైవేటుదా అని తెలంగాణ బీజేపి చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు.
Dharmapuri Arvind House Vandalised: ఎంపి ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. కుల అహంకారంతోనే కేసీఆర్ కుటుంబం ఈ దాడి చేయించిందని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
Marri Shashidhar Reddy Expelled from Congress : కాంగ్రెస్ పార్టీ గురించి, తమ నాయకుడు రేవంత్ రెడ్డి గురించి మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
Marri Shashidhar Reddy Slams Revanth Reddy : రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని వారించిన వారిలో తాను కూడా ఒకర్ని అని మర్రి శశిధర్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
Bandi Sanjay On CM KCR: ఆట తాము మొదలుపెట్టామని.. ఎండింగ్ భయంకరంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎంపీ అరవింద్ ఇంటిని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
Bandisanjay condemned attack on MP Arvind's residence: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ దాడిని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Bandi Sanjay: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేరళ, చిత్తూరులో మరోసారి సోదాలు చేపట్టారు సిట్ అధికారులు. రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్ నివాసాలు వారి వ్యాపార సముదాయలపై సోదాలు చేశారు.ఈ కేసులో పలువురి పేర్లు బయట కు రావడంతో నోటీసులు జారి చేసింది సిట్.
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను బీజేపీలో ఆహ్వానించారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
YS Sharmila Speech in Karimnagar : కరీంనగర్లో చేపట్టిన పాదయాత్ర సభలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎంపీ, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్‌ల వైఖరిపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
PM Modi's Telangana Visit: హైదరాబాద్‌కి చేరుకోవడంతోనే బేగంపేటలో స్వాగత సభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. " నేనొక కార్యకర్తను. తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశిస్తేనే మీ వద్దకు వచ్చాను '' అని చెప్పి పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజాన్ని నింపారు.
Bandi Sanjay to CM KCR : తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్... అదే నిజమైతే ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయన్నే నేరుగా కలిసి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
Bandi Sanjay About Raja Singh: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి బీజేపీనే పోటీ ఇస్తుందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపినే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు మోపిన పీడీ యాక్టును తెలంగాణ హై కోర్టు కొట్టేయడాన్ని గుర్తుచేస్తూ బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay on munugode Bypolls: టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా రాచకొండ కమిషనర్, ఎస్పీ, ఎన్నికల ప్రధానాధికారి వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై శివన్నగూడెంలో టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి మద్యం మత్తులో దాడికి ప్రయత్నించారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.