AP Politics: తెలుగుదేశం పార్టీకు ఎంపీ అభ్యర్ధులు కావలెను

AP Politics: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓ వైపు వైనాట్ 175 లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేర్పులతో జాబితాలు విడుదల చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2024, 08:37 AM IST
AP Politics: తెలుగుదేశం పార్టీకు ఎంపీ అభ్యర్ధులు కావలెను

AP Politics: ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గెలుపు గుర్రాలే లక్ష్యంగా భారీ మార్పులతో నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల్లో మూడో జాబితాకు సిద్ధమౌతోంది. అటు తెలుగుదేశం పార్టీ ఇంకా పొత్తు సమీకరణాలే దాటలేకపోతోంది. 

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమౌతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు జాబితాలతో 38 మంది అభ్యర్ధుల్ని ప్రకటించింది. రెండ్రోజుల్లో మరో 30 మందితో మూడో జాబితాకు సిద్దమౌతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా జనసేనతో పొత్తు సమీకరణాల్లోనే మునిగి ఉంది. ఆ పార్టీకు ఎన్ని అసెంబ్లీ, ఎన్ని లోక్‌సభ స్థానాలు కేటాయించేది స్పష్టత లేదు. ఎక్కడెక్కడ ఇచ్చేది ఇంకా తెలియలేదు. సంక్రాంతి నాటికి తెలుగుదేశం పార్టీ తొలి జాబితా వెలువడుతుందని ఆశిస్తున్నా...జనసేనతో సీట్ల సర్దుబాటు లేకుండా ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. 

ఏ ఇబ్బంది లేని కుప్పం, మంగళగిరి, టెక్కలి వంటి స్థానాలతో తొలి జాబితా విడుదల చేసే అవకాశాలున్నా పొత్తు ధర్మానికి వ్యతిరేకమయ్యే పరిస్తితి ఉంది. ఇదంతా పక్కన బెడితే అసలు తెలుగుదేశం పార్టీకు ఇప్పుడు ప్రధాన సమస్య అభ్యర్ధులు లభించడం లేదు. పార్టీకు ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులు కరువౌతున్న పరిస్థితి కన్పిస్తోంది. ఎందుకంటే...

పార్టీకు ఉన్న ముగ్గురు ఎంపీల్లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకు రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇక గుంటూరు ఎంపీ గళ్లా జయదేవ్ చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. చాలామంది అభ్యర్ధులు ఆసెంబ్లీకే మొగ్గు చూపిస్తున్నారు. లోక్‌సభకు వెళ్లేందుకు ఎవరికీ పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. సినీ నటుడు శివ ప్రసాద్ మరణంతో తిరుపతి ఎంపీ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే ప్రశ్న వస్తోంది. చిత్తూరు లోక్‌సభ అభ్యర్ధి ఎవరనే ప్రశ్నకు కూడా సమాధానం కన్పించడం లేదు. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈసారి పోటీ చేసేందుకు సముఖంగా లేరు. కడప బరిలో దిగేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నర్శరావు పేట నుంచి పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు పార్టీకు చాలాకాలంగా దూరంగా ఉన్నారు. రాజమండ్రి నుంచి పోటీ చేసి మురళీమోహన్ కోడలు గానీ ఆయన గానీ ఈసారి పత్తా లేరు.

మొత్తానికి తెలుగుదేశం పార్టీకు 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో సగానికి పైగా అభ్యర్ధులు లభించని పరిస్థితి ఎదురౌతోంది. పార్లమెంట్‌కు పోటీ చేసే వ్యక్తి ఆర్ధికంగా కూడా బలంగా ఉండాల్సిన పరిస్థితి ఉండటంతో ఎవరనేది ప్రశ్నార్ధకంగా మారుతోంది. 

Also read: Ysrcp 3rd List: వైసీపీలో కలకలం, 30 మందితో సిద్ధమైన మూడో జాబితా, ఎవరున్నారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News