Rajyasabha Elections 2024: మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్ధులు ఖరారు, గెల్చుకుంటుందా

Rajyasabha Elections 2024: ఓ వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలు. ఏపీలో అధికార, విపక్షాలకు కత్తీమీదసామే. మూడు స్థానాల అభ్యర్ధుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆ ముగ్గురు ఎవరంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2024, 08:56 AM IST
Rajyasabha Elections 2024: మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్ధులు ఖరారు, గెల్చుకుంటుందా

Rajyasabha Elections 2024: ఏపీలో ఓవైపు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నకలు, మరోవైపు రాజ్యసభ ఎన్నికలు ఒకేసారి వచ్చిపడ్డాయి. ఏప్రిల్ 2 నాటికి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడు స్థానాల ఎన్నికలు మార్చ్‌లోనే జరగనున్నాయి. మూడింటినీ కైవసం చేసుకునేందుకు వైసీపీ సన్నాహాలు పూర్తి చేసింది. 

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం ఉండి కూడా ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఇప్పుడు త్వరలో మార్చ్ నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో భారీగా మార్పులు చేర్పులతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇప్పటికే రాజీనామా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. ఈ క్రమంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్ని వైసీపీ గెల్చుకోగలదా అనేది సందేహంగానే మిగిలింది. ఎందుకంటే మూడు స్థానాల్ని గెల్చుకోవాలంటే వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరూ చేజారకూడదు. మరోవైపు రాజ్యసభ స్థానాలు కూడా ఏపీకు అత్యంత కీలకం. 

ఏపీలో ఇప్పుడు సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడు స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముగ్గురిని ఖరారు చేసింది. పాయకరావు పేట ఎమ్మెల్యేగా ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గొల్ల బాబూరావు, బలిజ సామాజికవర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పేర్లను దాదాపుగా ఖరారు చేశారు. మూడు స్థానాల్ని దక్కించుకోవడం వైసీపీకు చాలా అవసరం. కేంద్రంతో పనులు చేయించుకోవాలంటే రాజ్యసభ స్థానాల్లో ఆధిక్యం ఉండాల్సిన పరిస్థితి. 

సాధారణ పరిస్థితుల్లో అయితే వైసీపీకు ఉన్న సంఖ్యాబలంతో మూడు రాజ్యసభ స్థానాల్ని గెల్చుకోవడం కష్టమేం కాదు. కానీ ప్రస్తుతం అసెంబ్లీ అభ్యర్ధుల్ని మార్చుతున్న తరుణంలో ఇప్పటికే ఇద్దరు అధికారికంగా రాజీనామా చేశారు. మరి కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఎవరు ఎప్పుడు చేజారుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అదే జరిగితే ఆ ప్రభావం కచ్చితంగా రాజ్యసభ ఎన్నికలపై పడుతుంది. అందుకే వైసీపీకు రాజ్యసభ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి.

Also read: TTD Official Website: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వెబ్‌సైట్ పేరు మార్పు.. దర్శనం టికెట్లు ఇక్కడ బుక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News